నిత్య యవ్వనంగా కనిపించాలంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు..!

Divya
ప్రతి ఒక్కరి అందం మరియు ఆహార్యం,మనం పాటించే ఆహారం అలవాట్లు,జీవనశైలి మీద ఆధారపడి ఉంటాయి.మనం తీసుకునే ఆహారంలో ఉన్న పోషకాలు మన వయస్సుని రెట్టింపు చేయకుండా కాపాడుతాయి.కొంతమందిలో వయసుతో సంబంధం లేకుండా మొహంపై ముడతలు,జుట్టు తెల్లబడటం, అనేక అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటారు.అలా కాకుండా 40ల్లో కూడా 20 ల్లా కనిపించాలి అంటే కొన్ని నియమాలు తప్పకుండా పాటించాల్సిందేనని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా..
కొంతమంది అదే పనిగా ఎక్కువగా కూల్ డ్రింకులు మరియు సోడాలు తీసుకుంటూ ఉంటారు.దానివల్ల అందులోని కెమికల్స్ అందాన్ని పాడుచేస్తాయి.కావున అందంగా,యవ్వనంగా కనిపించాలి అనుకునేవారు,సోడాను అస్సలు తీసుకోవద్దంటున్నారు ఆహార నిపుణులు.అది క్రమంగా వారిని ముసలివాళ్లుగా మార్చేస్తుందంటున్నారు.
ఈ మధ్యకాలంలో చాలామంది అధిక బరువుతో బాధపడుతూ వున్నారు.వారంతా బరువు తగ్గడానికి భోజనం తీసుకోకపోవడం,లేదా తక్కువ ప్రోటీన్‌ కలిగిన ఆహారం తీసుకోవడం వంటివి చేస్తుంటారు.కానీ అలాంటి పొరపాటులు అస్సలు చేయకూడదని ఆహారనిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు.ఇలా చేయడం వల్ల తొందరగా వృద్ధాప్య ఛాయలు చుట్టముడుతాయని చెబుతున్నారు.
ఈ మధ్యకాలంలో సెల్ఫోన్ వాడటం చాలా ఎక్కువ అయిపోయింది.కానీ కొంతమందికి  తెలియక చేసే తప్పు నిద్రపోయే ముందు సెల్‌ఫోన్ లో మాట్లాడటం, సెల్‌ఫోన్‌లో చాటింగ్ చేయడం,అందులో వీడియోలు చూడటం వల్ల,వాటి నుండి ప్రసారమయ్యే బ్లూ రేస్  యవ్వనంగా కనిపించకుండా చేస్తాయని హెచ్చరిస్తూ ఉన్నారు.సెల్ ఫోన్  చాప కింద నీరులాగా చాలా అనారోగ్య సమస్యలను కూడా తెచ్చి పెడుతుంది.కావున వాటిని వాడటం తగ్గించడం చాలా మంచిది.
చాలామందికి ఉదయం లేవగానే కాఫీ,టీలు లేనిదే రోజు గడవదు.అలాంటి వారికి అందులోని కెఫెన్ తొందరగా వృద్ధాప్య ఛాయలు వచ్చేలా చేస్తుందని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మన శరీరంలో వృద్ధాప్య చాయలు తగ్గిపోవాలంటే,ఫేస్ మరియు బాడీ ఎక్సర్సైజులు చేయడం చాలా ఉత్తమం. దీనివల్ల శరీరంలో అధిక కొలెస్ట్రాల్ తొందరగా కరిగిపోయి,వృద్ధాప్యచాయలను దూరం చేస్తాయి.
అంతే కాదు కొంతమంది ఎక్కువ స్వీట్ లు తింటువుంటారు.అ స్వీట్ లు కృత్రిమ తీపిపదార్ధాలతో తయారుచేస్తారు.కనుక కొలెస్ట్రాలను తగ్గించుకోవాలి అనేవారు స్వీటు తినకపోవడం చాలా మంచిది.వాటికి బదులుగా బెల్లం,తాటిబెల్లం వంటివి వాడటం చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: