గుండె జబ్బులని ఈజీగా తగ్గించే సింపుల్ టిప్స్?

Purushottham Vinay
ఈ రోజుల్లో గుండె జబ్బుల సమస్యలతో బాధపడేవారి సంఖ్య పెరిగిపోతోంది. అందుకు కారణం ఏంటంటే జీవనశైలిలో మార్పులు. చాలా మందికి కూడా గుండె జబ్బులపై అవగాహన లేకపోవడం, తీసుకునే ఆహారం గురించి పెద్దగా పట్టించుకోకపోవడం, సరైన వ్యాయామం లేకపోవడం, మానసిక ఆందోళన ఇంకా ఆర్థిక ఇబ్బందులు వంటి కారణాల వల్ల చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు.ప్రతిరోజు ఉదయం పూట బ్రేక్‌ఫాస్టులో ఓట్స్‌ తినడం వల్ల గుండెకు ఎంతో మేలు కలుగుతుంది. ఎందుకంటే వీటిలో లభించే బీటా గ్లూకాన్‌ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గిస్తుంది. గోధుమలు, బార్లీ, పప్పు ధాన్యాలు ఇంకా బీన్స్‌ మొదలైనవి ఆహారంలో తీసుకోవడం చాలా మంచిది.వీటిలో ఉండే విటమిన్స్‌, ఐరన్‌ ఇంకా ఫైబర్‌ యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును ఈజీగా అదుపులో ఉంచుతాయి. దీని వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది.ఇంకా ఇవే కాకుండా టోమాటోలు, యాపిల్స్‌ ఇంకా సోయా వంటివి రోజువారీగా తీసుకున్నట్లయితే గుండెను బాగా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.ఇక సాధారణంగా చేపలు ఎక్కవగా తినేవారిలో హృదయ సంబంధిత వ్యాధులు తక్కువేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. చేపల్లో ఉండే ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు గుండె పనితీరును బాగా మెరుగు పరుస్తాయి.వేళకు ఆహారం తీసుకోకపోవడం, వ్యక్తిగత, వృత్తిపరమైన ఒత్తిళ్లు ఇంకా తగినంత వ్యాయమం లేకపోవడం వంటివి గుండె పనితీరును మందగింపజేస్తున్నాయి. రక్తనాళాల్లో కోలెస్ట్రాల్‌ లెవెల్స్ పెరిగిపోవడం కూడా గుండె పనితీరును ప్రభావితం చేస్తోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.ఇక ఆకు కూరలు గుండెకు ఎంతో మంచిది. క్యాన్సర్‌ వంటి రోగాలను కూడా దరిచేరనివ్వవు. పాలకూర, కొత్తమీద ఇంకా ర్యాడిష్‌ మొదలైన వాటిలో కొవ్వు శాతం తక్కువ ఉండటంతో పాటు ఫోలిక్‌ యాసిడ్‌, మెగ్నీషియం, కాల్షియం అలాగే పోటాషియం ఎక్కువగా లభిస్తాయి. ఇవి గుండె పనితీరును మెరుగు పర్చడంలో బాగా సహాయపడతాయి. ప్రతి రోజూ ఆహారంలో భాగంగా ఇవి తీసుకునేవారికి మిగిలిన వారితో పోలిస్తే హార్ట్‌ ఎటాక్‌ వచ్చే అవకాశాలు 11 శాతం తక్కువగా ఉంటాయి.
సిక ఆందోళన ఇంకా ఆర్థిక ఇబ్బందులు వంటి కారణాల వల్ల చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు.ప్రతిరోజు ఉదయం పూట బ్రేక్‌ఫాస్టులో ఓట్స్‌ తినడం వల్ల గుండెకు ఎంతో మేలు కలుగుతుంది. ఎందుకంటే వీటిలో లభించే బీటా గ్లూకాన్‌ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గిస్తుంది. గోధుమలు, బార్లీ, పప్పు ధాన్యాలు ఇంకా బీన్స్‌ మొదలైనవి ఆహారంలో తీసుకోవడం చాలా మంచిది.వీటిలో ఉండే విటమిన్స్‌, ఐరన్‌ ఇంకా ఫైబర్‌ యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును ఈజీగా అదుపులో ఉంచుతాయి. దీని వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది.ఇంకా ఇవే కాకుండా టోమాటోలు, యాపిల్స్‌ ఇంకా సోయా వంటివి రోజువారీగా తీసుకున్నట్లయితే గుండెను బాగా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.ఇక సాధారణంగా చేపలు ఎక్కవగా తినేవారిలో హృదయ సంబంధిత వ్యాధులు తక్కువేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. చేపల్లో ఉండే ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు గుండె పనితీరును బాగా మెరుగు పరుస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: