కిడ్నీలో చెత్తని క్లీన్ చేసి హెల్తీగా ఉంచే టిప్?

Purushottham Vinay
కొన్ని రకాల హెల్తీ టిప్స్ పాటించడం వల్ల అలాగే ఒక పానీయాన్ని తయారు చేసి తీసుకోవడం వల్ల మనం ఒక్క రోజులోనే మూత్రపిండాలను ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు.దీని వల్ల మూత్రపిండాలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. ఇక మూత్రపిండాలను శుభ్రపరిచే ఆ పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ పానీయాన్ని తయారు చేసుకోవడానికి  మనం ధనియాలను ఉపయోగించాల్సి ఉంటుంది. మూత్రపిండాలను శుభ్రపరచడంలో ధనియాలు మనకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇంకా అలాగే దీనిలో పాటు మనం జీలకర్రను, ఒక నిమ్మకాయను కూడా ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ ధనియాలను రోట్లో వేసి వాటిని కచ్చా పచ్చాగా దంచుకుని ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో నిండుగా నీటిని పోసి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. దీని వల్ల ధనియాల్లో ఉండే ఔషధ గుణాలు ఈజీగా నీటిలోకి వస్తాయి.ఆ తరువాత ఈ నీటిని గిన్నెలో పోసి చిన్న మంటపై ఒక 5 నిమిషాల పాటు వేడి చేయాలి.


ఇలా వేడి చేసిన తరువాత ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇంకా అలాగే నిమ్మకాయను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి.తరువాత ఈ నీటిని మరో 5 నిమిషాల పాటు బాగా మరిగించి స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి. ఆ తరువాత ఈ నీటిని వడకట్టి గ్లాస్ లోకి తీసుకోవాలి. అలాగే ఇందులో రుచి కొరకు తేనెను కూడా మనం వేసుకోవచ్చు. అయితే దీనిని కేవలం గోరు వెచ్చగా మాత్రమే తీసుకోవాలి. ఇంకా అలాగే రోజులో ఎప్పుడైనా దీనిని తీసుకోవచ్చు. ఇలా పానీయాన్ని తయారు చేసి తీసుకోవడం వల్ల మూత్రపిండాలు ఈజీగా శుభ్రపడతాయి.అలాగే మూత్రపిండాల్లో పేరుకుపోయిన మలినాలు తొలగిపోతాయి.నెలకు ఒకటి లేదా రెండు సార్లు ఇలా తీసుకోవడం వల్ల మూత్రపిండాలను ఎల్లప్పుడూ కూడా చాలా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.ఇంకా అలాగే రోజూ 4 నుండి 5 లీటర్ల నీటిని ఖచ్చితంగా తాగాలి. ఈ విధంగా ఈ టిప్స్ పాటించడం వల్ల ఎల్లప్పుడూ మూత్రపిండాలను సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఈ టిప్స్ వల్ల అసలు మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: