ఈ ధాన్యం ఆహారంగా తీసుకుంటే ఏ జబ్బు రాదు?

Purushottham Vinay
ప్రస్తుత కాలంలో బియ్యంతో వండిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువగా వస్తున్నాయి.ఇంకా అలాగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా తక్కువగా ఉంటాయి. దీంతో చాలా మంది ఇప్పుడు మళ్ళీ చిరుధాన్యాలను ఆహారంగా తీసుకుంటున్నారు. అయితే కొనుగోలు చేయడానికి ఇబ్బంది లేని వారు చిరుధాన్యా లకంటే మెరుగైన ధాన్యాన్ని తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక అత్యధిక ప్రోటీన్స్ కలిగిన ధాన్యాల్లో క్వినోవా ధాన్యం కూడా ఒకటి. దీనిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.100 గ్రాముల క్వినోవా ధాన్యంలో 14 గ్రాముల ప్రోటీన్ అనేది ఉంటుంది. ఇంకా అలాగే ఈ ధాన్యం చాలా తేలికగా కూడా జీర్ణం అవుతుంది. ఈ ధాన్యంలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా చాలా పుష్కలంగా ఉంటాయి.ఇక ఈ యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ ప్లామేటరీగా పని చేస్తాయి. ఎదిగే పిల్లలకు ప్రోటీన్ అనేది చాలా అవసరం. ఇక ఒక కిలో బరువుకు 2 గ్రాముల ప్రోటీన్ అవసరమవుతుంది.


బియ్యంతో వండిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల మనకు చాలా తక్కువ మొత్తంలో ఈ ప్రోటీన్ అనేది లభిస్తుంది.గర్భిణీ స్త్రీలు ఇంకా వృద్దులు ఈ ధాన్యాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల ప్రోటీన్ లోపం తలెత్తకుండా ఉంటుంది. ఇంకా అలాగే క్వినోవా ధాన్యంలో 7 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణశక్తిని మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడుతుంది.ఇంకా అలాగే  షుగర్ వ్యాధితో బాధపడే వారు ఈ ధాన్యాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి.షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్న వారు అలాగే ఈ వ్యాధి రాకూడదు అనుకున్న వారు ఈ ధాన్యాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.ఇంకా అలాగే సూక్ష్మ పోషకాలు కూడా ఈ ధాన్యంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. బరువు తగ్గాలనుకున్న వారు ఇంకా గుండె జబ్బులతో బాధపడే వారు ఈ ధాన్యాన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: