మామిడిపండ్లు తినేముందు ఈ జాగ్రత్త తప్పనిసరి?

Purushottham Vinay
మామిడిపండ్లు చాలా తియ్యగా ఇంకా చాలా రుచిగా ఉంటాయి. వయసుతో సంబంధం లేకుండా అందరూ కూడా వీటిని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. మామిడిపండ్లను తినడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే చాలా రకాల పోషకాలు కూడా లభిస్తూ ఉంటాయి. అయితే మామిడిపండ్లను తినే ముందు వాటిని నీటిలో నానబెట్టి తినాలని  చెబుతూ ఉంటారు. ఇలా నీటిలో నానబెట్టి తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నీటిలో నానబెట్టకుండా మామిడిపండ్లను తీసుకోవడం వల్ల ముఖంపై మొటిమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇంకా అలాగే మామిడిపండ్లను తినడం వల్ల శరీరంలో వేడి చేసే అవకాశం చాలా ఉంది.ఇంకా అలాగే మలబద్దకం, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మామిడి పండ్లను మనం నీటిలో నానబెట్టి తీసుకోవాలి.  మామిడిపండ్లను నీటిలో నానబెట్టి తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇంకా వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మామిడికాయల్లో సహజ సిద్దంగానే ఫైటిక్ అనే యాసిడ్ ఉంటుంది. ఇది మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలు శరీరం గ్రహించకుండా ఖచ్చితంగా అడ్డుపడుతుంది. దీంతో శరీరంలో పోషకాల లోపం అనేది తలెత్తుతుంది. ఇక మామిడిపండ్లను నీటిలో నానబెట్టి తీసుకోవడం వల్ల ఈ ఫైటిక్ యాసిడ్ మామిడి పండ్ల నుండి బయటకు రిలీజ్ అవుతుంది. దీంతో మామిడి పండ్లను తిన్నా కూడా మనకు ఎలాంటి హాని కలగదు.


మామిడిపండ్లను పండించడానికి వివిధ రకాల మందులను ఇంకా పురుగుమందులను వాడుతూ ఉంటారు.మామిడి పండ్లను నేరుగా తీసుకోవడం వల్ల ఇవి మన జీర్ణవ్యవస్థను దెబ్బతీసే ఛాన్స్ ఉంటుంది. అలాగే తలనొప్పి, మలబద్దకం ఇంకా చర్మ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మామిడిపండ్లను నీటిలో నానబెట్టి తీసుకోవడం వల్ల ఈ సమస్యలనేవి రాకుండా ఉంటాయి. అలాగే మామిడిపండ్లను తినడం వల్ల శరీరంలో వేడి చేసే ఛాన్స్ కూడా ఉంది. వాంతులు, తల తిరిగినట్టు ఉండడం ఇంకా ముఖంపై మొటిమలు వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అదే మామిడిపండ్లను తినే అరగంట ముందు నీటిలో నానబెట్టి తీసుకోవడం వల్ల శరీరానికి వేడి చేయకుండా ఉంటుంది.ఇంకా అలాగే మామిడిపండ్లను అర గంట పాటు నీటిలో నానబెట్టి తీసుకోవడం వల్ల వాటిలో ఉండే విష పదార్థాలు కూడా ఈజీగా తొలగిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: