ఈ డ్రింక్ తాగితే పొట్ట ఈజీగా కరుగుతుంది?

frame ఈ డ్రింక్ తాగితే పొట్ట ఈజీగా కరుగుతుంది?

Purushottham Vinay
అధిక బరువు, అధిక పొట్ట సమస్య తలెత్తడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. వ్యాయామం చేయకపోవడం, జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, ఒత్తిడి, ఆందోళన ఇంకా అలాగే వివిధ రకాల అనారోగ్య సమస్యలు, నూనెలో వేయించిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం అలాగే పంచదారతో తయారు చేసిన పదార్థాలను ఎక్కువగా తినడం, రోజంతా కూర్చొని పని చేయడం ఇంకా శారీరక శ్రమ లేకపోవడం వంటి వివిధ కారణాల వలన మనలో చాలా మంది కూడా ఈ సమస్య బారిన పడుతున్నారు.ఇక అధిక బరువు తగ్గాలనుకునే వారు మొలకెత్తిన విత్తనాలను, పచ్చి కూరగాయలను ఇంకా అలాగే సలాడ్ లను ఎక్కువగా తీసుకోవాలి. ఇలా మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక పానీయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల మన శరీరంలో మెటబాలిజం రేటు అనేది పెరుగుతుంది. దీంతో మన శరీర బరువుతో పాటు ఇంకా అలాగే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కూడా ఈజీగా తొలగిపోతుంది.అధిక పొట్ట సమస్య నుండి మనం చాలా ఈజీగా బయటపడవచ్చు. శరీరంలో మెటబాలిజం రేటును పెంచి శరీర బరువును తగ్గించే ఆ పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలి? ఇంకా దానికి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


ముందుగా నిమ్మకాయలో ఉండే రసాన్ని తీసి నిమ్మ తొక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోని ఆ తరువాత ఒక గిన్నెలో ఒకటిన్నర గ్లాస్ నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులో కట్ చేసుకున్న నిమ్మకాయ తొక్కలు, పావు టీ స్పూన్ పసుపు ఇంకా ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి నీటిని బాగా వేడి చేయాలి. ఈ నీటిని సగం అయ్యే దాకా మరిగించిన తరువాత వడకట్టి ఈ నీటిని ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో నిమ్మరసం వేసి బాగా కలపాలి.ఇలా తయారు చేసుకున్న డ్రింక్ ని రోజూ ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల శరీరంలో మెటబాలిజం రేటు పెరుగుతుంది. అందువల్ల క్రమంగా బరువు తగ్గుతారు. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు, మలినాలు ఇంకా విష పదార్థాలన్నీ సులభంగా తొలగిపోతాయి. ఈ డ్రింక్ ని తాగడం వల్ల శరీరంలో నీరసం తగ్గుతుంది. రోజంతా చాలా ఉత్సాంగా పని చేసుకోవచ్చు. దీనిని క్రమం తప్పకుండా ఒక 20 రోజుల పాటు తీసుకుంటూనే మంచి జీవన విధానాన్ని, చక్కటి ఆహార నియమాలను ఖచ్చితంగా పాటించాలి. ఈ విధంగా ఈ టిప్ ని పాటించడం వల్ల మనం చాలా సులభంగా అధిక బరువు ఇంకా అధిక పొట్ట సమస్య నుండి సులభంగా బయటపడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: