ధూమపానం: ఈ సంకేతాలు కనిపిస్తే చావు తథ్యం?

Purushottham Vinay
ఇక మన శరీరంపై ధూమపానం ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనలో కొన్ని రకాల హెచ్చరిక సంకేతాలు కనిపిస్తాయి. వీటిని గమనించిన వెంటనే ఖచ్చితంగా ఈ ధూమపానం మానేయాలి. లేకపోతే మన ప్రాణాలను కాపాడడం వైద్యుల తరం కూడా కాదని వారే స్వయంగా చెబుతున్నారు. మరి ధూమపానం ప్రభావంతో శరీరంలో కనిపించే సంకేతాలేమిటో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..ఇక ధూమపానం అనేది ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె జబ్బులు, స్ట్రోక్‌తో సహా చాలా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ముడిపడి ఉంది. మీరు కనుక ఇలాంటి వ్యాధుల చరిత్రను కలిగి ఉంటే లేదా మీ కుటుంబంలో ఇంతకముందు ఇలాంటి సమస్యలు ఉంటే అది ఖచ్చితంగా మీ ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. ఈ ప్రమాదాన్ని తగ్గించడానికి వీలైనంత త్వరగా ధూమపానం మానేయడం ఆరోగ్యానికి చాలా మంచిది.అలాగే సిగరెట్, పొగాకు ఉత్పత్తుల పొగలో చాలా రసాయనాలు ఉంటాయి.


ఇవి కాలక్రమేణా మీ దంతాల సహజ రంగును కూడా మారుస్తాయి. ఇంకా మీ నోటి ఆరోగ్యం ఇంకా చిగుళ్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇంకా అంతేకాదు మీ చేతులు కూడా సహజత్వాన్ని కోల్పోతాయి. మీరు మీ దంతాలు పసుపు రంగులోకి మారుతున్నాయని గమనిస్తే ఖచ్చితంగా ధూమపానం మానేయండి.ఇక పొగతాగడం వల్ల కూడా మీరు వాసన, రుచిని ఖచ్చితంగా కోల్పోతారు.మీకు ఇష్టమైన ఆహార పదార్థాలు తిన్నప్పటికీ కూడా  వాటి రుచిని మీరు అస్సలు ఆస్వాదించలేరు ఇంకా గ్రహించలేరు.ఇక వాసన సరిగ్గా రావడం లేదని మీరు గ్రహించినట్లయితే, అది ఖచ్చితంగా ధూమపానం వలన ఏర్పడిన దుష్ప్రభావమే. కాబట్టి మీరు వెంటనే ఖచ్చితంగా ఈ సిగరెట్ ని మానేయాలి.మీరు ధూమపానానికి చెక్ పెట్టకపోతే..ఇది ఖచ్చితంగా మీకు ఊపిరి ఆడకపోవడానికి దారితీస్తుంది. ఎందుకంటే సిగరెట్ పొగ ఊపిరితిత్తులు ఆక్సిజన్ తీసుకునే సామర్థ్యాన్ని ఈజీగా తగ్గిస్తుంది. కాబట్టి శ్వాస సమస్యతో మీరు బాధపడుతున్నట్లయితే వెంటనే ఈ ధూమపానానికి చెక్ పెట్టండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: