కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఇలా చెయ్యండి?

Purushottham Vinay
ఇక ప్రస్తుత కాలంలో చాలామంది కూడా వారి చిన్న వయసు నుంచే అధిక కొలెస్ట్రాల్ సమస్యతో చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. అసలు వారు ఎలాంటి ప్రయత్నాలు చేసినా కూడా కొలెస్ట్రాల్ తగ్గడం లేదని చాలా బాధపడుతున్నారు.అయితే ఈ చెడు కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.ఎందుకంటే మన ధమనులలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం అధికం అవ్వడం వల్ల రక్తం సరైన మోతాదులో గుండెకు అందదు. దాని కారణంగా ఖచ్చితంగా స్ట్రోక్, గుండెపోటు లాంటి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే రక్త పరీక్ష వలన శరీరంలో కొలెస్ట్రాల్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ఎక్కువ కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించుకోవడానికి ఆరోగ్యకరమైన జీవన శైలి చాలా చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఆరోగ్యకరమైన ఆహారం విధానాలు పాటించకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ అస్సలు తగ్గవు.ట్రాన్స్ఫాట్ అనేది ప్రస్తుతం ఉన్న రోజులలో ప్రతిదాంట్లో వాడే కొవ్వు.



ఇది ఎంతో ప్రమాదకరమైనది. ఇలాంటి పరిస్థితులలో సంతృప్తి ట్రాన్స్పోర్ట్ ఉన్న కొవ్వుని అస్సలు తీసుకోవద్దు. హెల్తీ లైఫ్ స్టైల్ తో పాటు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి శరీరక శ్రమ కూడా మనకు చాలా అవసరం. కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి ప్రతి రోజు కూడా ఖచ్చితంగా ఒక 30 నిమిషాలు నడవాలి లేదా వ్యాయామం చెయ్యాలి. ఇక ఆల్కహాల్ తీసుకోకూడదు. ఎందుకంటే దీన్ని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ పై ప్రభావం పడుతుంది. ప్రతిరోజు తక్కువ కొలెస్ట్రాల్ మందులు తీసుకుంటూ ఆల్కహాల్ తాగితే ఆ మందులు మీ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపించవు. కొలెస్ట్రాల్ కి వైద్యులు సూచించిన మందులను సరైన మోతాదులో సమయానికి తీసుకుంటూ ఉండాలి. కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించుకోవడానికి ప్రతి రోజు కూడా ఖచ్చితంగా చాలా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఉండాలి. కొలెస్ట్రాల్ చాలా ఉన్నవాళ్లు కీటో డైట్ చేయకూడదని డాక్టర్లు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: