ఎలకల బెడదని తగ్గించే సింపుల్ హోమ్ టిప్?

Purushottham Vinay
ఎలకల బెడద చాలా మందిని కూడా ఎంతగానో వేధిస్తూ ఉంటుంది.ఎందుకంటే అవి ఇంట్లోకి వచ్చి ఏది దొరికితే అది కొరికి నమిలి పడేస్తూ ఉంటాయి. ఆహారాలను ఇంకా అలాగే సరుకులను కొరకడంతో పాటు వీటి కారణంగా ఎన్నో రకాల ప్రాణాంతక వ్యాధులు కూడా చాలా ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. వీటి వల్ల ఖచ్చితంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.అయితే చాలా మంది కూడా ఈ ఎలుకల సమస్య నుండి బయటపడడానికి ఎలుకల మందు, బోను ఇంకా గ్లూ మ్యాట్ వంటి వాటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ చిన్న పిల్లలు ఉన్న చోట వీటిని ఉపయోగించడం వల్ల వారికి ఖచ్చితంగా కూడా ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.అందుకే కొన్ని రకాల ఇంటి చిట్కాలను ఉపయోగించి మనం చాలా చాలా ఈజీగా ఈ ఎలుకల సమస్య నుండి బయట పడవచ్చు. ఎలుకలను తరిమి కొట్టే ఆ ఇంటి చిట్కాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.


పుదీనా నూనెను తీసుకొని దానిని ఇంటి మూలల్లో  అక్కడక్కడ చల్లడం వల్ల ఈ ఎలుకలు రాకుండా ఉంటాయి. దీని ఘాటైన వాసన వల్ల ఎలుకలు ఇంట్లో నుండి చాలా ఈజీగా బయటకు పోతాయి. ఇంకా అలాగే లవంగాల వాసన కూడా ఎలుకలుకు అంతగా నచ్చదు. కాబట్టి ఎలుకలు ఎక్కువగా తిరిగే ప్రదేశాల దగ్గర లవంగాలను ఉంచడం వల్ల లేదా లవంగాల నూనెను ఉంచడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది. ఇంకా అదే విధంగా ఒక పలుచటి వస్త్రంలో కారాన్ని వేసి మూట కట్టి ఈ మూటను ఎలుకలు ఉండే చోట ఇంకా ఎలుకలు ఇంట్లోకి ప్రవేశించే చోట ఉంచాలి. ఇలా చేయడం వల్ల కూడా ఎలుకలు రాకుండా ఉంటాయి. అలాగే ఉల్లిపాయల వాసన కూడా ఈ ఎలుకలకు అంతగా నచ్చదు. ఉల్లిపాయలను కట్ చేసి ఎలుకలు తిరిగే చోట అక్కడక్కడ ఉంచడం వల్ల ఉల్లిపాయల నుండి వచ్చే వాసన వల్ల ఆ ఎలుకలు చాలా ఈజీగా బయటకు వెళ్లిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: