కొలెస్ట్రాల్, రక్తపోటు, మధుమేహంని తగ్గించే పండ్లు?

Purushottham Vinay
బ్లాక్ ఫ్రూట్స్ తినడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే ఈ నల్లటి పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే పోషకాలు కొలెస్ట్రాల్, రక్తపోటు ఇంకా అలాగే మధుమేహం వంటి వ్యాధులను నయం చేస్తాయి. అందుకే అలాంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఏలాంటి బ్లాక్ ఫ్రూట్స్ ఖచ్చితంగా తినాలి.. ఏ పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిది అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..నల్ల ఎండుద్రాక్ష ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది.ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ చాలా పుష్కలంగా ఉంటాయి. నల్ల ఎండుద్రాక్ష రక్తపోటును నియంత్రించడంలో చాలా బాగా సహాయపడుతుంది. దీన్ని తినడం వల్ల ఎముకలు కూడా చాలా దృఢంగా మారుతాయి.అలాగే ఈ నల్ల ఎండుద్రాక్ష రక్తహీనతను కూడా ఈజీగా తొలగిస్తుంది.ఇక చాలా మందికి కూడా చెర్రీ ఎరుపు రంగు పండు గురించి మాత్రమే తెలుసు. కానీ బ్లాక్ చెర్రీని కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు.


ఎందుకంటే ఈ బ్లాక్ చెర్రీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చాలా ఉన్నాయి. ఇది కీళ్లనొప్పులు, జీర్ణక్రియ వంటి సమస్యలను చాలా ఈజీగా దూరం చేయడంలో  మేలు చేస్తుంది.అలాగే బ్లాక్‌బెర్రీస్‌లో పోషకాలు చాలా పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి, ఫైబర్ ఇంకా అలాగే మాంగనీస్ వంటి పోషకాలు వీటిలో చాలా పుష్కలంగా లభిస్తాయి. అందువల్ల మెదడు చాలా ఆరోగ్యంగా ఉండేలా పనిచేస్తాయి.అలాగే బ్లాక్‌బెర్రీస్ కొలెస్ట్రాల్‌ను కూడా ఈజీగా అదుపులో ఉంచుతాయి. ఇవి డయాబెటిస్‌ కి కూడా చాలా మంచి ప్రయోజనకరంగా పరిగణిస్తారు.ఇక నల్ల ద్రాక్ష విషయానికి వస్తే.. ఈ పండు రుచిలో పుల్లగా ఉంటుంది. కానీ ఈ పండు ఆరోగ్యానికి చాలా మంచిది. ద్రాక్షలో విటమిన్ ఇ ఇంకా అలాగే యాంటీఆక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఇంకా అలాగే వీటి వినియోగం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మం ఇంకా అలాగే జుట్టుకు కూడా చాలా రకాలుగా మేలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: