పాదాల పగుళ్లను మాయం చేసే ఆకు ఇదే..!!

Divya
చలికాలంలో ఎక్కువగా ప్రతి ఒక్కరికి పాదాలు అనేది పగుళ్లుతూ ఉంటాయి.. అంతేకాకుండా చర్మం కూడా  చలికాలంలో కాస్త పగిలినట్లుగా కూడా కనిపిస్తూ ఉంటుంది. పాదాల సమస్య తగ్గించుకోవడానికి కేవలం ఒక చిట్కా పాటిస్తే సరిపోతుందని కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు. చలికాలంలో పాదాల పట్ల ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. చలికాలంలో పాదాలకు పగుళ్లు సమస్య ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు.

పాదాలకు తేమ, పొడిగాలి సరిగ్గా లేకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతూ ఉంటాయని వైద్యులు సూచిస్తూ ఉన్నారు. సరైన పోషకాహారం తీసుకోకపోవడం, పెరుగుతున్న వయసును బట్టి నేల మీద ఎక్కువగా నిలబడడం.. షుగర్ వంటి సమస్యలు కారణంగా ఎక్కువగా పాదాలు సమస్య వస్తుందని వైద్యులు తెలియజేస్తున్నారు. అయితే ఈ పాదాల పగుల సమస్యను ఎవరు కూడా పెద్దగా పట్టించుకోకుండా ఉంటారు. దీనివల్ల సమస్య ఎక్కువగా వచ్చినప్పుడు నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి సమస్య నుంచి విముక్తి పొందాలి అంటే మన ఇంట్లో ఉండే మొక్కలతో పాదాల మధ్య పగుళ్లను తొలగించుకోవచ్చు.

పాదాల పగుళ్లకు కరివేపాకు ,గోరింటాకు పాదాల పగుళ్లను తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుందట. కరివేపాకు ఆకులను గోరింటాకు ఆకులను సమానంగా తీసుకొని శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఆకులను మెత్తగా నూరి ఈ పేస్టులు కొన్ని మర్రిపాలను కలిపి పాదాల పగుళ్లు ఉన్న చోట కలిపి రాయాలి.. రాత్రి పడుకునే సమయం లో పాదాలకు రాసి మరుసటి రోజు ఉదయం పాదాలను కడిగి వేయాలి. ఈ విధంగా ఒక వారం రోజులపాటు పాదాలకు రాసినట్లు అయితే పాదాలు మృదువుగా మారిపోతాయి. కరివేపాకులో ఉండే విటమిన్స్ పాదాల పగుళ్లను తగ్గించడానికి చాలా సహాయపడతాయట. అలాగే గోరింటాకు లో ఉండే పోషకాలు కూడా పాదాల పగుళ్లు ఉన్న ప్రదేశంలో కొత్త కణాల అభివృద్ధికి సహాయపడతాయట. ఈ విధంగా చేయడం వల్ల పాదాల పగుళ్లు తగ్గుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: