
అలాంటివారు పచ్చిబఠానీలు తింటే అంతేనా..?
జీర్ణ సంబంధిత సమస్యలు కలవారు..
జీర్ణశయ సమస్యలైన గ్యాస్ లేదా ఎసిడిటీతో సమస్యతో బాధపడేవారు పచ్చి బఠానీలను అధికంగా తీసుకోకూడదు.ఎందుకంటే వారికి ఇవి జీర్ణం అవడం చాలా సమయం పడుతుంది అందువల్ల గ్యాస్ పార్మ్ అయి పొట్ట సమస్యలు అధికమవుతాయి.మరియు గుండెల్లో మంటగా అనిపిస్తుంది.
మూత్రపిండ సమస్యలు..
వీటిలో అధికంగా ప్రొటీన్లు పచ్చి బఠాణిలను అధికంగా తినడం తీసుకోవడం వల్ల,ఇందులోని ప్రోటీన్ వల్ల కిడ్నీలపై భారం పడి, కిడ్నీ సమస్యలు అధికమవుతాయి.
ఉబకాయం..
అధిక బరువుతో బాధపడేవారు ఎక్కువ మొత్తంలో పచ్చి బఠాణిలను తీసుకోవడం వల్ల, ఇందులోని కార్బోహైడ్రేట్లు ఎక్కువగా శరీరంలోకి చేరి ఉబకాయానికి దారితీస్తుంది. మరియు చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయి గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది.అధిక బరువు తగ్గాలి అనుకున్న వారు, వీటిని తమ డైట్లో చేర్చుకోకపోవడం ఉత్తమం.
అధిక యూరిక్ యాసిడ్ తో బాధపడేవారు..
ఇందులో శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు, అమైనో యాసిడ్‌లు, విటమిన్ డి పుష్కలంగా లభిస్తాయి. ఈ న్యుట్రియన్స్ యూరిక్ యాసిడ్‌ని అధికంగా ఉత్పత్తి కావడానికి దోహదం చేస్తాయి. అధిక యూరిక్ యాసిడ్ శరీరంలో నిలిచిపోవడం వల్ల, స్పటికాలుగా మారి కీళ్లలోకి చేరి, కీళ్ల నొప్పులకు దారితీస్తాయి.అందువల్ల అధిక యూరిక్ యాసిడ్ తో బాధపడేవారు పచ్చి బఠానీలను తీసుకోకపోవడం మంచిది.