ఈ జ్యూస్ తాగితే ఏ జబ్బు రానే రాదు?

Purushottham Vinay
చలికాలం వచ్చిందంటే చాలు ఖచ్చితంగా చాలా  రకాల సీజనల్ ఆరోగ్య సమస్యలు వస్తాయి.ఈ చలికాలంలో శరీరం బాగా చల్లగా ఉంటుంది. అందుకే ఈ వాతావరణాన్ని తట్టుకునే శక్తి పోషకాహారం తీసుకోవడం ద్వారానే శరీరానికి లభిస్తుంది. ఇక చలికాలంలో లభించే పలు రకాలైన కూరగాయలను జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల చాలా రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇక అలాంటి కూరగాయలలో లేదా జ్యూస్‌లలో ముఖ్యంగా చెప్పుకోదగినది క్యారెట్ జ్యూస్. క్యారెట్ జ్యూస్ చాలా పోషకాలతో నిండి ఉంటుంది. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఇది చాలా బాగా సహకరిస్తుంది. మరి క్యారెట్ జ్యూస్‌ను తాగడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే లాభలెంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి విటమిన్ ఏ చాలా ఎక్కువగా ఉండే ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే కంటి సమస్యలు అలాగే రేచీకటి వంటి సమస్యలకు మూల కారణం విటమిన్ ఏ లోపమే. కాబట్టి ప్రతి రోజూ కూడా ఈ క్యారెట్ జ్యూస్ తాగడం  కంటి చూపుకు చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


అలాగే క్యారెట్ జ్యూస్ లో ఉండే బీటా కోరెటిన్ గుండె జబ్బులకు దారితీసే ప్రీ రాడికల్స్ పోరాడానికి చాలా బాగా పని చేస్తుంది. క్యారెట్ జ్యూస్ లో విటమిన్ సి, ఇ ఇంకా అలాగే ఫోలెట్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా చెడు ఎల్ డీఎల్ కొలెస్ట్రాల్ ఆక్సీకరణ అనేది జరగకుండా తగ్గిస్తుంది. దీంతో గుండె జబ్బుల నుంచి ఖచ్చితంగా దూరంగా ఉండవచ్చు.ఇంకా అలాగే బ్లడ్ షుగర్ తో బాధపడేవారు తరచూ క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ తగిన మొత్తంలో అందుతాయి.క్యారెట్ లో ఉండే క్యాలరీలు, విటమిన్లు ఇంకా అలాగే మినరల్స్ మధుమేహాన్ని ఈజీగా నిరోధించడానికి పోరాడతాయి.ఇంకా ఈ చలికాలంలో ప్రతి రోజూ కూడా ఓ గ్లాస్ క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల ఖచ్చితంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఇది మన శరీరాన్ని ప్రీ రాడికల్స్ డ్యామెజ్ నుంచి రక్షించడమే కాక, హానికర బ్యాక్టిరియా ఇంకా అలాగే వైరస్ ల నుంచి రక్షణ పొందడానికి సాయం చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: