పసుపుతో ఇలా చేస్తే ఈజీగా బరువు తగ్గొచ్చు?

frame పసుపుతో ఇలా చేస్తే ఈజీగా బరువు తగ్గొచ్చు?

Purushottham Vinay
పసుపుతో ఇలా చేస్తే ఈజీగా బరువు తగ్గొచ్చు?

అధిక బరువు సమస్యని ఈజీగా తగ్గించుకోవడానికి పసుపును తీసుకోవడం మంచిది. పసుపులో కర్కుమినాయిడ్స్, హెపటోమెట్రిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు సహాయపడతాయి. అదే సమయంలో ఊబకాయాన్ని తగ్గించేందుకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా స్థూలకాయముండేవారికి సాధారణంగా డయాబెటిస్ ముప్పు ఉంటుంది. పసుపు ఉపయోగించడం వల్ల డయాబెటిస్‌కు చెక్ పెట్టడమే కాకుండా ఆరోగ్యానికి చాలా ప్రయోజనం కలుగుతుంది.. పసుపులో ఉండే ఫెనోల్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఒబెసిటీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని వైట్ ఎడిపోజ్ టిష్యూలో వాపు తగ్గించేందుకు పనిచేస్తాయి. అందుకే పసుపు వివిధ రకాలుగా సేవించడం వల్ల బరువు కచ్చితంగా తగ్గుతారని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.పాలలో కొద్దిగా పసుపు కలుపుకోవడం బరువు తగ్గడానికి, మొత్తం ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది జలుబు మరియు దగ్గుకు వ్యతిరేకంగా మీ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. 


రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పసుపు పాలు తాగడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.యాంటీఆక్సిడెంట్లు, మూలికల గొప్ప మూలం, అల్లం బరువు తగ్గడానికి గొప్పది. తరిగిన అల్లం వేసి నీటిని మరిగించాలి. తరవాత అందులో కాస్త పసుపు వేసి కాసేపు అలాగే ఉంచాలి. ఈ పానీయం వడకట్టవచ్చు..లేదంటే అలాగే తాగేయవచ్చు. దీన్ని రోజూ తాగడం వల్ల బరువు తగ్గుతారు. అల్లం ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది.దాల్చిన చెక్క బరువు తగ్గడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. పసుపు టీలో కొంచెం దాల్చిన చెక్కను జోడించడం వల్ల బరువు తగ్గడానికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.తేనెతో పసుపు టీ బరువు తగ్గించేందుకు సహయపడే ఓ గొప్ప పానీయం. తేనె ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది. తేనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. ఇవి ఎఫెక్టివ్‌గా బరువు తగ్గడంలో సహాయపడతాయి.కాబట్టి ఖచ్చితంగా ఇలా పసుపుని వినియోగించుకొని ఈజీగా బరువు  తగ్గండి. ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా జీవించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: