మన ఆరోగ్యానికి మేలు చేసే నూనెల్లో సన్ ప్లవర్ ఆయిల్ ఒకటి. ఈ నూనెను ఎక్కువగా వాడతారు. ఈ నూనెను వంటకాల్లో వాడడం వల్ల ఆర్థరైటిస్ సమస్య రాకుండా నివారించవచ్చు. అలాగే దీని ద్వారా ఎక్కువ మోతాదులోనూ విటమిన్స్ ను పొందవచ్చు. మన ఆరోగ్యానికి మేలు చేసే నూనెల్లో నువ్వుల నూనె ఒకటి. దీనిని ఎంతో కాలంగా వంటల్లో ఉపయోగిస్తున్నారు. ఇది రుచితో పాటు ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఎందుకంటే దీనిలో అన్ స్యాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ ను అరికడతాయి. వేరుశనగ నూనెను కూడా మనం వంటల్లో వాడవచ్చు. గతంలో ఈ నూనెను ఎక్కువగావాడే వారు.ఈ నూనెను వాడడం వల్ల వంటలు ఘుమఘుమలాడుతూ ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. 100 గ్రా. ల వేరుశనగ నూనెలో 884 క్యాలరీల శక్తి ఉంటుంది. ఇది ఫంగల్, వైరల్ ఇన్ ఫెక్షన్ ల నుండి దైరంగా ఉంచడమే కాకుండా మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. అలాగే ఎక్స్ ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ఒకటి. ఈ నూనె తయారు చేసే పద్దతుల్లో రసాయనాలను అతి తక్కువగా వాడతారు.
అందువల్ల ఈ నూనెలో విటమిన్స్,ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ నూనె తాజాగా ఉండడం వల్ల దీనిలో ఓలిక్ ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. సలాడ్ లలో, పాస్తా చేసిన తరువాత దీనిపై ఆలివ్ నూనెను చల్లితే పోషకాలన్ని మన శరీరానికి అందుతాయి. వేపుడు కూరలు చేసేటప్పుడు, డీప్ ప్రైలు చేసేటప్పుడు ఈ నూనెను వాడకపోవడమే మంచిది.కొబ్బరి నూనె అధికంగా మన దేశంలో దక్షిణాది రాష్ట్రాల వారు ఉపయోగిస్తారు. దీన్ని సాంప్రదాయంగా ఎన్నో వంటల్లో వాడుతున్నప్పటికి వీలైనంత వరకు దీని వాడకాన్ని తగ్గించుకోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.కొంత కాలం కిందట జొన్న నూనె ఆరోగ్యకరమైన వంటనూనెగా చెప్పబడుతూ మార్కెట్ లోకి వచ్చింది. కానీ తరువాతి రోజుల్లో అది అనారోగ్యమని దీనిని తీసుకోవడం వల్ల కడుపులో మంట వస్తుందని చెప్పడంతో ఆ నూనె వాడకం తగ్గింది.అన్నీ వంటనూనెల కంటే కూడా పామ్ ఆయిల్ అనారోగ్యకరమైనది. ఇందులో ట్రాన్స్ ప్యాట్ లు తయారీ విధానం పై ఆధారపడి 80 నుండి 85 శాతం వరకు ఉంటాయి.