దంతాలను ఈజీగా తెల్లగా మార్చే టిప్?

Purushottham Vinay
దంతాలను ఈజీగా తెల్లగా మార్చే టిప్ ?

కొంతమందికి ఎంత శుభ్రం చేసినా కూడా దంతాలు పసుపు రంగులో ఉంటాయి. అయితే అలా మారడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. పొగాకు వాడడం, దంతాలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, టీ మరియు కాఫీలను ఎక్కువగాతాగడం, ఇతర అనారోగ్య సమస్యలకు సంబంధించిన మందులను వాడడం, మద్యసానం, ధూమపానం వంటి అనేక కారణాల చేత దంతాలు పసుపు రంగులోకి మారుతాయి.మనం మన దంతాలను తెల్లగా మార్చుకోడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తాము. అయితే ఎటువంటి ఖర్చు లేకుండా కేవలం హోమ్ టిప్స్ ఉపయోగించి పసుపు రంగులో ఉన్న దంతాలను తెల్లగా మార్చుకోవచ్చు. దంతాలను తెల్లగా మార్చే చిట్కా ఏమిటి.. ఈ చిట్కాను ఎలా తయారు చేసుకోవాలి.. అలాగే ఈ చిట్కాను ఎలా వాడాలి అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. దంతాలు పసుపు రంగులో ఉన్న వారు ఈ చిట్కాను పాటించడం వల్ల చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గాను మనం కేవలం రెండు పదార్థాలను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది.


కేవలం నిమ్మకాయ, బేకింగ్ సోడాను ఉపయోగించి మనం దంతాలను తెల్లగా మార్చుకోవచ్చు.ఇక ఈ టిప్ ని తయారు చేసుకోవడానికి గాను ముందుగా ఒక గిన్నెలో ఒక చిటికెడు బేకింగ్ సోడాను తీసుకోవాలి. తరువాత అందులో అర చెక్క నిమ్మరసాన్ని పిండి రెండింటినీ బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని బ్రష్ తో కానీ వేలితో కానీ తీసుకుని దంతాలను శుభ్రపరుచుకోవాలి. ఈవిధంగా వారానికి రెండు సార్లు దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల దంతాలపై ఉండే పసుపుదనం తొలగిపోయి దంతాలు తెల్లగా మారతాయి. ఈ టిప్ ని పాటించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా చాలా సులభంగా దంతాలను తెల్లగా మార్చుకోవచ్చు.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి.ఎల్లప్పుడూ కూడా మీ దంతాలను శుభ్రంగా తెల్లగా ఉంచుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: