వామ్మో ఈ లక్షణాలుంటే గుండెపోటు ఖాయం?
చాలా మంది గుండెపోటు వల్ల చనిపోతున్నారు.గుండె పోటు ముందు వచ్చే లక్షణాలను సకాలంలో గుర్తించకపోవడంతో పరిస్థితి విషమించి ప్రాణం కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మనిషికి దాదాపు 30 సెకన్ల పాటు ఎక్కిళ్ళు ఉంటే, అది సాధారణమైనవే. ఆందోళన అవసరం లేదు. అయితే జర్నల్ ఆఫ్ న్యూరాలజీ అండ్ న్యూరోఫిజియాలజీలో ప్రచురించిన పరిశోధన ప్రకారం, ఆగకుండా నిరంతరం ఎక్కిళ్ళు వస్తుంటే, ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఎక్కిళ్లు తగ్గకపోతే, అది స్ట్రోక్‌కు సంకేతం కావచ్చు. కాబట్టి ఎక్కిళ్లను నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను వెంటనే సంప్రదించడం మంచిది.దీర్ఘకాలిక మైగ్రేన్లు స్ట్రోక్ ప్రమాదాన్ని 50 శాతం పెంచుతాయి. మీరు ఎప్పుడైనా అకస్మాత్తుగా భరించలేని తలనొప్పిని ఎదుర్కొంటే వెంటనే కార్డియాలజిస్ట్‌ను సంప్రదించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.ఆకస్మాత్తుగా గందరగోళానికి గురైతే, మీరు ఎక్కడ ఉన్నారు,మీ చుట్టూ ఏమి జరుగుతోందో అర్థం కానీ అయోమయ పరిస్థితి ఉంటే వెంటనే జాగ్రత్త పడాలి. ఇలాంటి సందర్భంలో మైకంగా, అసౌకర్యంగా అనిపించవచ్చు. మనిషి నీరసంగా ఉంటారు.
మత్తులో ఉన్నప్పుడు ఇలాగే ఉంటుంది. కానీ ఆల్కహాల్ తాగకపోయినా, మత్తులో లేకపోయినా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడి వద్దకు వెళ్లాలి.కొన్నిసార్లు చెప్పాలనుకున్న మాటను సరిగ్గా చెప్పలేరు. పదాలు అస్పష్టంగా వస్తాయి. మాట్లాడటానికి కంఠం పెగలదు, తక్కువ స్వరంలో మాట్లాడతారు. కొన్నిసార్లు అసలే మాట్లాడలేకపోవచ్చు. ఇవి స్ట్రోక్‌కి సంబంధించిన సంకేతాలు కావచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.గుండెకు రక్తం సరిగ్గా ప్రవహించలేనప్పుడు, చేతిలో బలహీనత మొదలవుతుంది. అప్పుడు చేతులు, కాళ్ళలో తిమ్మిరి, గందరగోళం వంటి సమస్యలను ఎదురవుతాయి. తరచుగా ఈ లక్షణాలన్నీ శరీరానికి ఒక వైపున సంభవిస్తాయి. కానీ దీని ప్రభావం శరీరం అంతటా ఉంటుంది. కొన్నిసార్లు తల తిరగుతున్నట్లు అనిపించవచ్చు. వాంతులు అవుతున్నట్లు కూడా అనిపించవచ్చు. ఇలాంటి లక్షణాలను ఎదుర్కొంటుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.