ఏడవడం వల్ల కూడా ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా..?
ముఖ్యంగా కంటిలో కన్నీళ్లను స్రవించే గ్రంధి ఉంటుంది దీనిని లాక్రియల్ గ్రంధి అంటారు. ఇది చాలామంది కంటి నీటిని ఆపేందుకు ప్రయత్నించిన కుదరకుండా చేస్తుంది. అయితే ఎలాంటి సమయంలో కూడా కంటిలో నీళ్లు వచ్చేటప్పుడు ఆపుకోకూడదని వైద్యులు తెలియజేస్తున్నారు.
1). చాలామంది ప్రజలు ఒత్తిడిని జయించడానికి లేదా బాధలను దిగమింగుకోవడానికి అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటారు. అయితే ఇలా చేయడం వల్ల నాడీ వ్యవస్థ చాలా చురుకుగా పనిచేస్తుంది. అంతేకాకుండా శరీరం మనసు కూడా విశ్రాంతి తీసుకోవడానికి చాలా సహాయపడుతుందట.
2). కంటి నుండి నీరు బయటికి విడుదలైనట్లు అయితే కంటి లోపల ఉండే దుమ్ము, కాలుష్యం వంటివి కూడా ఆ నీటితో పాటు బయటికి వస్తాయి. అంతేకాకుండా కన్నీళ్లు కళ్ళను హైడ్రేటుగా ఉంచుతుంది. ఇది పొడి కంటి లక్షణాలను తగ్గిస్తుంది.దీనివల్ల దృష్టి కూడా మెరుగుపడుతుంది.
3). ఏదైనా ఒత్తిడిని తగ్గించుకోవాలన్న ఏదైనా బాధను లేదా నొప్పి వల్ల ఏడుస్తున్నప్పుడు శరీరంలో ఆక్సిటోసిన్లు విడుదలవుతాయి ఇది మానసిక బాధలను శరీర బాధల నుంచి కూడా తగ్గిస్తుంది.
4). ఏడవడం వల్ల ఎన్నోసార్లు చెప్పుకోలేని బాధలు కూడా తొలగిపోతాయని వైద్యులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఒత్తిడిని జయించాలి అంటే అప్పుడప్పుడు కంటి నుండి నీరు బయటికి రావడమే మంచిదట.
5). కళ్ళనాడి వ్యవస్థ చురుకుగా పని చేయాలి అంటే కంటి నుంచి నీరు రావడం చాలా మంచిది. దీనివల్ల కళ్ళు కూడా చాలా చురుగ్గా పనిచేస్తాయి.