మొబైల్ ను దిండు కింద కింద పెట్టుకొని పడుకుంటున్నారా..?

Divya

ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే మనలో చాలామంది ముందుగా మొబైల్ ని ఎక్కువగా చూస్తూ ఉంటారు. రాత్రిపూట పడుకునే ముందు కూడా మొబైల్ ని ఎక్కువగా చూస్తూనే నిద్రపోతూ ఉన్నాము.. అయితే మొబైల్ చూసిన తర్వాత చాలామంది పక్కనే పెట్టుకొని నిద్రపోతూ ఉంటారు. మరి కొంతమంది దిండు కింద పెట్టుకొని నిద్రపోతూ ఉంటారు. అయితే ఇలా మొబైల్ తలకింద కానీ, దిండు కింద కానీ పెట్టుకోవడం చాలా ప్రమాదమని వైద్యులు సూచిస్తున్నారు. అయితే కొంతమంది పరిశోధకులు పరిశోధనలు చేసి కొన్ని విషయాలను తెలియజేశారు వాటి గురించి చూద్దాం.

మొబైల్ వల్ల వెలుపడే రేడియేషన్ వల్ల మనిషి ఆరోగ్యం పై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది అని WHO సమస్త హెచ్చరిస్తోంది. ఇది నిద్రకు తీవ్రమైన ఆటంకం కలిగించడమే కాకుండా చాలా ప్రమాదాల బారిన పడేలా చేస్తుందని తెలుపుతున్నారు. ముఖ్యంగా మొబైల్ నుంచి వెలుపడే రేడియేషన్ వల్ల పెద్దలకంటే పిల్లలకు చాలా హానికరం అన్నట్లుగా వైద్యులు సూచిస్తూ ఉన్నారు. మొబైల్ ను దిండు కింద పెట్టుకొని పడుకునేటప్పుడు.. మొబైల్ లోపల ఉండే బ్లూ లైట్ మన శరీరం పై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. మనకి ఏదైనా మెసేజ్ కాల్స్ వచ్చినప్పుడు చీకట్లో మొబైల్ లో ఉండే బ్లూ లైట్ వెలగడం జరుగుతుంది దాన్ని చూసినప్పుడు మన కళ్ళకు చాలా ప్రమాదమట.

మొబైల్ ను దిండుకుంద పెట్టుకొని పడుకోవడం వల్ల మొబైల్ పేలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తీవ్రమైన వేడి ఒత్తిడి పడడం వల్ల మొబైల్ లోపల ఉండే బ్యాటరీ హీట్ అయ్యి పేలే అవకాశం ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

అయితే కొంతమంది పరిశోధనలు చేసిన తర్వాత రాత్రివేళల మొబైల్ ని ఎక్కువగా వినియోగిస్తే నిద్రకు ఆటంకం కలుగుతుందని ఆ సమయంలో ఎక్కువ రేడియేషన్ విడుదలై శరీరాన్ని త్వరగా అలసిపోయేలా చేస్తాయట. అంతేకాకుండా ఇది క్రమంగా మనం చేసే పని తీరుపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. అందుచేతను రాత్రి వేళల మొబైల్ ని దూరం పెట్టమని వైద్యులు సూచిస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: