గుండెపోటు లక్షణాలు కనిపిస్తే ఇలా చేయండి..!!

Divya
గుండెపోటు మరణాలు ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నాయి. మారుతున్న జీవన శైలి కారణంగా గుండెపోటు బారిన పడుతూ ఉన్నారు. మానసిక ఒత్తిడి ఆహారం, జీవనశైలి తదితర కారణాల వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్యులు సూచిస్తున్నారు. కొంతమంది ఎంత ఫిట్ గా ఉన్నా సరే గుండెపోటు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక తాజాగా ఒక పరిశోధనలు ఎక్కువగా 20 ఏళ్ల పైన యువతి యువకులు ఎక్కువగా మరణిస్తూ ఉన్నట్టుగా ఒక అధ్యయనంలో తేలినట్లు తెలుస్తోంది. అయితే గుండెపోటు వచ్చిన తర్వాత ఎలాంటి పనిచేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మన శరీరానికి అంతట ఆక్సిజన్ ని రక్తాన్ని సరఫరా చేయడం గుండె పని అని చెప్పవచ్చు. గుండే మిగిలిన అవయవాలను  సహజీవనంగా ఉంచే విధంగా పనిచేస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఉండే జబ్బులు, గుండెపోటు కేసులు  పెరుగుతూ ఉన్నాయి. సాధారణంగా ఎక్కువగా 40 సంవత్సరాలు పైబడిన వ్యక్తులలో మాత్రమే గుండె పోటు, మధుమేహం , హై బీపీ ఇతర సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. యువత కూడా ఈ మధ్యకాలంలో ఇలాంటి జబ్బుల బారిన పడడంతో చిన్న వయసులోనే మరణిస్తూ ఉన్నారని వైద్యులు తెలియజేస్తున్నారు.

దేశంలో 50 శాతం మంది గుండెపోటు రోగులు సకాలంలో హాస్పిటల్ కి చేరుకోకపోవడం వల్ల చాలామంది మరణిస్తున్నట్లుగా తెలియజేశారు. ముఖ్యంగా చాతిలో నొప్పి వచ్చిందంటే చాలు గ్యాస్ వల్ల కలిగే నొప్పి అని అందరూ నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దీనివల్లే పలు సమస్యలు కూడా ఎదురవుతాయి. ఈ మధ్యకాలంలో గుండెపోటు కేసులు కూడా ఎక్కువగా పెరుగుతు ఉన్నాయట. కరోనా తర్వాత చాలామందిలో రక్తంలో మార్పులు వస్తున్నాయని దీనివల్ల కూడా గుండెపోటు ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయని సమాచారం. ముఖ్యంగా ఎవరింట్లోనైనా సరే గుండెపోటు జబ్బు వారు ఉన్నారంటే.. వారి కుటుంబ సభ్యులలో కూడా వారసత్వంగా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా యువతలో వచ్చే టెన్షన్, హై బీపీ కారణాలవల్ల గుండెపోటుకు కారణమవుతుందట.
గుండెపోటు వస్తే ముందుగా అంబులెన్స్ కు కాల్ చేయాలి..ముఖ్యంగా గుండెపోటు వస్తే ఛాతీ పై పదే పదే ఒత్తిడి వంటివి చేయాలి. లేదంటే ఇంట్లో ఆస్పిరిన్ టాబ్లెట్లను వేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: