షుగర్: ఈ పండ్లు తింటే 7 రోజుల్లో మాయం?

Purushottham Vinay
ఇక మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది కూడా మధుమేహం సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించపోవడం వల్లే ఇలాంటి సమస్యలు అనేవి ఉత్పన్నమవుతున్నాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.మధుమేహం సమస్య నుంచి ఉపశమనం పొందడానికి కచ్చితంగా మీరు తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించి.. ప్రోటిన్లు గల ఆహారాలను తీసుకోవాలి. లేకపోతే శరీరంలోని రక్తంలో చక్కెర పరిమాణం అనేది పెరిగిపోయి తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశాలు కూడా ఉన్నాయి.కావున మధుమేహం నుంచి ఉపశమనం పొందడానికి పలు రకాల నియమాలు మీరు పాటించాల్సి ఉంటుంది. ఇక అందులో ముఖ్యమైనది జీవనశైలిలో మార్పులు. కావునా ఈ మార్పుల వల్ల మధుమేహం నియంత్రంణలో ఉండే అవకాశాలున్నాయి.ఇక బేరి పండులో గ్లైసెమిక్ ఇండెక్స్ పరిమాణాలు తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది రక్తంలో చక్కెర స్థాయిలని బాగా నియంత్రిస్తాయి. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి3 ఇంకా విటమిన్ బి9లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా బేరిలో పొటాషియం, కాల్షియం ఇంకా జింక్ పుష్కలంగా ఉంటుంది. కావున ఇది శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది.


ఇంకా జామ పండులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటమే కాకుండా.. సోడియం కూడా తక్కువగా ఉంటుంది. కావున మధుమేహ వ్యాధిగ్రస్తులపై చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. ఈ జామపండులో నారింజ కంటే నాలుగు రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. కావున రక్తంలో చక్కెరను ఈజీగా నియంత్రిస్తుంది.అలాగే సిట్రస్ పండ్లు మధుమేహాన్ని తగ్గించేందుకు చాలా ప్రభావవంతంగా పని చేస్తాయి. ఇందులో ఉండే సిట్రస్ గుణాలు డయాబెటిస్‌ను కంట్రోల్‌ చేయడమే కాకుండా ఇంకా శరీరాన్ని కూడా దృఢంగా చేస్తుంది.అలాగే డయాబెటిక్ రోగులకు గ్రీన్ యాపిల్ సూపర్ ఫుడ్‌ అని వైద్యులు చెబుతారు. ఈ పండులో కరిగే ఫైబర్, నియాసిన్, జింక్ ఇంకా ఐరన్ ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెరను నియంత్రించడానికి బాగా సహాయపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: