పరగడుపున ఇలాంటి ఆహారాలు తీసుకుంటున్నారా? తస్మాత్ జాగ్రత్త..!

Divya
ఇప్పుడున్న ఉరుకులు పరుకులు జీవితంలో సరిగా భోజనం చేయడానికి కూడా సమయం లేక ఏది పడితే అది..ఎప్పుడు పడితే అప్పుడు తీసుకుంటూ వుంటారు.ఇలాగే చాలామంది పరగడుపున, కొన్ని ఆహార పదార్థాలు తింటూ వుంటారు. ఇలా తింటే జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం వుందని,ముఖ్యంగా కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తుంటారు.మరి అవేంటో తెలుసుకుందామా..
పండ్ల రసాలు:
మనం తినే ఆహారంలో పండ్ల రసాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ పరగడుపునే పండ్ల రసాలు తీసుకోవడం వల్ల జీర్ణాషయంపై ప్రభావం చూపుతుంది. పండ్లలో ఉండే ఫ్రక్టోజ్ అనే చక్కెర లివర్ పై ప్రభావం చూపుతుందని టొరంటో విశ్వవిద్యాలయం న్యూట్రిషనల్ సైన్సెస్ డిపార్ట్‌మెంట్ పరిశోధన చేసి నిరూపించారు.
పుల్లటి పండ్లు:
నిమ్మ, మామిడి, నారింజ వంటి సిట్రస్ పండ్లు పొట్టలో  ఆమ్లాలను పెంచుతాయి. దీని వలన కడుపులో పుండ్లు, గ్యాస్ట్రిక్, అల్సర్ లు వచ్చే అవకాశం ఉంది.ఇక పండ్లలోని ఫైబర్, ఫ్రక్టోజ్ వల్ల జీర్ణవ్యవస్థ క్రమంగా పనిచేయకుండా చేస్తుంది .
టీ, కాఫీలు
ఖాళీ కడుపుతో టీ, కాఫీలు, పాల పదార్థాలను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ స్థాయి లు పెరిగి,పొట్టలో పుండ్లు, అసిడిటీ వచ్చే అవకాశం ఉంది.
పెరుగు:
పెరుగు, దోశ, ఇడ్లీ వంటి పులియబెట్టిన ఆహారాలను తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల పెరుగులోని లాక్టిక్ యాసిడ్ బాక్టీరియాతో మనకు  ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది. ఇంకా, అధిక ఆమ్ల స్థాయులు కారణంగా కడుపులో హైడ్రోక్లోరిక్ ఆమ్లము పెరిగి జీర్ణ సమస్యలు పెరుగుతాయి.
సలాడ్లు:
లావుగా వున్నవారు తగ్గడానికి సలాడ్లను పరగడుపున తీసుకుంటూ వుంటారు.సలాడ్లో ఉపయోగించే పచ్చి కూరగాయలలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. వీటిని పరగడుపున తింటే గ్యాస్ పార్మ్ అయి అలాగే కడుపు నొప్పికి దారితీస్తుంది.ఉదాహరణ కి టొమాట లో ఆక్జాలిక్ యాసిడ్ అధికంగా ఉండడం వల్ల,పొట్టలో అసిడిటిని కలిగిస్తుంది.కాబట్టి పరగడుపున తినడానికి ఏ ఏ ఆహారాలు ఆరోగ్యానికి మంచిదో ఆరోగ్యానిపుణలను అడిగి తెసలుసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: