నల్ల మిరియాలు: ఆరోగ్యానికి ఎంత మంచివో తెలుసా?

Purushottham Vinay
నల్ల మిరియాలు అనేవి చిన్నగా ఉన్నప్పటికీ, ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయనడంలో అసలు ఎలాంటి సందేహం లేదు. నల్ల మిరియాలు విటమిన్ సి, విటమిన్ ఎ, ఫ్లేవనాయిడ్లు, కెరోటిన్ ఇంకా ఇతర యాంటీ-ఆక్సిడెంట్ల వంటి లక్షణాలను కలిగి ఉంటాయి.దీంతో ఈ నల్ల మిరియాలు ఆరోగ్యంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంటాయి. ఈ నల్ల మిరియాలు తీసుకోవడం వల్ల క్యాన్సర్‌ను నిరోధించే ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. నల్ల మిరియాలను నెయ్యితో కలిపి కనుక తీసుకుంటే, ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఇక నల్ల మిరియాలను తీసుకోవడం వల్ల పొడి దగ్గు నుంచి త్వరగా మీకు ఉపశమనం లభిస్తుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి, 1/2 టీస్పూన్ నల్ల మిరియాలు ఒక టీస్పూన్ దేశీ నెయ్యితో కలిపి మీరు తీసుకోవాలి. నల్ల మిరియాలు ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. తద్వారా మీకు దగ్గు నుంచి ఉపశమనం పొందేలా చేస్తుంది.నెయ్యితో ఈ మిరియాలను కలిపి తింటే రోగ నిరోధక శక్తి బలపడుతుంది. నల్ల మిరియాలలో విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది.


ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి బాగా సహాయపడుతుంది. ఇటువంటి పరిస్థితిలో, జలుబు ఇంకా దగ్గు వంటి సమస్యలు ఉంటే, నల్ల మిరియాల పొడిని నెయ్యిలో కలిపి తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.ఇంకా కంటి చూపు బలహీనంగా ఉన్నవారికి కూడా నల్ల మిరియాలు తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. దీని కోసం, కొన్ని చుక్కల దేశీ నెయ్యిలో నల్ల మిరియాల పొడిని వేసి కలపండి. వీటిని ప్రతిరోజూ తినండి. కావాలంటే, ఇక అరికాళ్ళకు కూడా దీనిని రాసుకోవచ్చు. ఇది తక్కువ కంటి చూపు ఉన్నవారికి కూడా చాలా మేలు చేస్తుంది.ఇంకా వృద్ధాప్యంలో తరచుగా కీళ్ల నొప్పుల వస్తుంటుంది. కీళ్ల నొప్పుల నుంచి తేరుకోవాలంటే నెయ్యి ఇంకా నల్లమిరియాలు సేవిస్తే ఉపశమనం లభిస్తుంది. ఇందుకోసం మిరియాలను బాగా వేయించి నెయ్యితో తీసుకోవాలి. ఈ మిశ్రమం చక్కెర స్థాయిని అదుపులో ఉంచడంలో కూడా సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: