కన్నీటితో.. కంటి సమస్యలు తెలుసుకోవచ్చట?

praveen
సాధారణంగా మనసులో ఉన్న బాధను ఆనందాన్ని కళ్ళు తెలియజేస్తూ ఉంటాయి అన్న విషయం అందరికీ తెలుసు. మనసులో బాధ కలిగినప్పుడు కళ్లనుంచి కంట నీరు వస్తూ ఉంటుంది. ఎక్కువ ఆనందం కలిగిన కూడా ఆనందభాష్పాలు వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇలా కంటినీరు ఇప్పటివరకు మనసులో ఉన్న బాధను ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది అన్న విషయం మాత్రమే తెలుసు.. కానీ చైనాకు చెందిన శాస్త్రవేత్తలు ఇటీవలే ఒక వినూత్నమైన రహస్యాన్ని కనుగొన్నారు. కళ్ల నుంచి వచ్చే కంటి నీరు తో నేత్రవ్యాధులు కూడా కనిపెట్టవచ్చు అని చెబుతూ ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.

 ఇలా కళ్ల నుంచి కారే కన్నీళ్లతో నేత్ర వ్యాధులను  కనిపెట్టే కొత్త విధానాన్ని కనుగొన్నారు చైనా పరిశోధకులు. ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. కన్నీటి నుంచి ఎక్సో జోమ్స్ సేకరించే నానో పోర వ్యవస్థను వీరు అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సరికొత్త ఆవిష్కరణకు ఐ టియర్స్ అనే పేరు కూడా పెట్టారు చైనా శాస్త్రవేత్తలు. ప్రస్తుతం వైద్యులు.. లక్షణాల ఆధారంగా నేత్ర రుగ్మతలను  గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు అనే చెప్పాలి. అయితే ఏదైనా కంటి రుగ్మత ఏర్పడిన సమయంలో ప్రారంభదశలో లక్షణాలనూ గుర్తించి ఇక వ్యాధులను నిర్ధారించడంలో కాస్త ఇబ్బందులు ఉంటాయని చెబుతున్నారు.

 అయితే ప్రోటీన్లు, జన్యువుల నమూనాలను పరీక్షించడం ద్వారా వ్యాధి గుర్తింపులో కచ్చితత్వాన్ని పెంచే అవకాశం ఉంది అంటూ చెబుతున్నారు. ఇక ఇలాంటి వాటికి ఎక్కువ సమయం పడుతుంది. అయితే కన్నీటితో ఈ ఇబ్బందిని అధిగమించడానికి  వీలు ఉంది అని శాస్త్రవేత్తలు అంటున్నారు. తాము కనుగొన్న ఐ టియర్స్  అనే సాధనం ద్వారా కన్నీటి నమూనాలను వడ కట్టడం ద్వారా ఐదు నిమిషాల్లోనే ఎక్స్ జోన్లను అందించి వీటిలోని ప్రోటీన్లు ఫ్లోరసెంట్ మార్కర్ లతో  శాస్త్రవేత్తలు తయారుచేశారు. తర్వాత వీటిపై వేరే పరికరాలతో  విశ్లేషణ సాగించారు. ఇందులో న్యూక్లిక్ ఆమ్లాల ను కూడా సేకరించి పరిశీలించారు. ఈ క్రమంలోనే ఆరోగ్యవంతులు కంటి రుగ్మతలు కలిగిన వ్యక్తులను గుర్తించామని చైనా శాస్త్రవేత్తలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: