ఇమ్యూనిటీ: ఈ వంటింటి పదార్ధాలతో పెరగడం ఖాయం!

Purushottham Vinay
ఇక రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటేనే ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా ఉంటాం. ముఖ్యంగా ఈ సీజన్ లో అయితే ఎన్నో వ్యాధులు సోకే ప్రమాదం ఉంది.ఇలాంటి పరిస్థితిలో ఖచ్చితంగా ఇమ్యూనిటీని పెంచుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది.రోగనిరోధక వ్యవస్థ అనేది బలంగా ఉంటేనే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం.ప్రస్తుతం సీజనల్ వ్యాధులతో పాటుగా, కరోనా ఇంకా అలాగే మంకీపాక్స్ వైరస్ ల వ్యాప్తి చాలా దారుణంగా ఉంది. ఇక ఈ రోగాలన్నీ కూడా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండేవారికే వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే రోగనిరోధక శక్తిని వీలైనంత తొందరగా పెంచుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది.ఇంకా అలాగే అల్లంలో ఎన్నో రకాల ఔషదగుణాలుంటాయి. ఇవి ఎన్నో రోగాలను కూడా చాలా ఈజీగా తరిమికొట్టగలవు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ ఇంకా యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలు అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి. అల్లం కణాలు పోషకాలను గ్రహించడాన్ని చాలా మెరుగుపరుస్తుంది. అంతేకాదు ఇది రోగనిరోధక వ్యవస్థను కూడా చాలా బలంగా చేస్తుంది.అలాగే పసుపులో యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ల్ఫమేటరీ ఇంకా యాంటీ బాక్టీరియల్ గుణాలుంటాయి. ఇవి ఎన్నో రకాల అంటువ్యాధులతో కూడా పోరాడుతాయి.ఇంకా అలాగే రోగనిరోధక శక్తిని కూడా ఇవి పెంచుతాయి. ఈ మసాలా లో ఖనిజాలు ఇంకా విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతగానో మంచి చేస్తాయి.


ఇంకా అలాగే నల్ల మిరియాలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో Carminative లక్షణాలుంటాయి. ఇవి జీర్ణ సమస్యలను ఇంకా అలాగే పేగు వాయువు వంటి ప్రమాదాలను తగ్గిస్తుంది. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ ఇంకా అలాగే యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ఇక ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడమే కాదు.. జ్వరాన్ని కూడా చాలా ఈజీగా తగ్గించగలవు.అలాగే వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడమే కాదు వివిధ రకాల అంటువ్యాధుల ప్రమాదాన్ని కూడా ఈజీగా తగ్గిస్తుంది.ఇంకా అలాగే తులసిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయి.తులసి దగ్గు, జలుబు వంటి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. తులసి ఆకులతో టీ తయారుచేసుకుని తాగితే ఆరోగ్యం చాలా బేషుగ్గా ఉంటుంది. తులసి ఆకులు రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతాయి. ఇంకా అలాగే శరీర శక్తి స్థాయిలను కూడా పెంచుతాయి. వీటిని తీసుకోవడం వల్ల ఒత్తిడి నుంచి మంచి ఉపశమనం అనేది కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: