చర్మం జిడ్డుగా ఉందా ఇలా చేస్తే సరి..!!

Divya
మారుతున్న వాతావరణం వల్ల చర్మం పైన పలు ప్రభావాలు చూపుతూ ఉంటాయి. వాతావరణం మారినప్పుడల్లా చర్మ సంరక్షణ ఉత్పత్తిలో కూడా పలుమార్పులు చేయవలసి ఉంటుంది. ఈ సీజన్లో వాతావరణం లో ఉండే తేమ వల్ల బ్యాక్టీరియా చర్మాన్ని అంటుకునేలా ఉంటుంది. దీనివల్లనే ముఖం పైన మొటిమలు కూడా వస్తాయట. ఫేషియల్ చేయించుకోవడం వల్ల ముఖం రూపాన్ని పాడు చేయడమే కాకుండా ముఖానికి నొప్పిగా కూడా అనిపిస్తుంది. వర్షాకాలంలో ముఖం పైన మొటిమలు, జిడ్డు చర్మం ఉన్నట్లయితే ఈ చిట్కాలను పాటించడం వల్ల వాటిని తొలగించుకోవచ్చు.. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
1). ఎక్కువగా తేమ ఉండడం వల్ల బ్యాక్టీరియా విపరీతంగా ఉంటుంది. దీని కారణంగా ముఖం పైన బ్యాక్టీరియా ఎక్కువసేపు ఉంటుంది. ఈ బ్యాక్టీరియా చర్మ రంధ్రాలలో పేరుకుపోవడం జరుగుతుంది. అందుచేతనే ఈ సీజన్లో ముఖాన్ని శ్రద్ధగా కడుగుతూ ఉండాలి.
2). వర్షాకాలంలో చర్మం బిగుతుగా ఉంటుంది దీని వలన మన ముఖం ఎక్కువ తేమ గా ఉండడం జరుగుతుంది. ఈ సీజన్లో ఎక్కువగా జెల్ ఆధారిత మాయిశ్చరైజర్ చేయడం చాలా ఉత్తమమట.
3). ఎక్కువ నీటిని తాగడం వల్ల మన శరీరం హైడ్రేటుగా ఉంటుంది. దీంతో చర్మ సమస్యల నుండి ప్రతి ఒక్కరు బయటపడవచ్చు. నీటిని ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో టాక్సిన్స్ ఎక్కువగా మూత్రం ద్వారా బయటి కి వెళ్లిపోతాయి.
   
4). ఎక్కువగా  ఔషధ గుణాలు వేపాకులో ఉంటాయి. వేపాకు చర్మం పైన ఉపయోగించడం వల్ల ముఖం పైన ఉండే పింపుల్స్, బ్లాక్ హెడ్స్ తొలగించడానికి ఉపయోగపడతాయి. కొన్ని వేపాకులను తీసుకొని మిక్సీలో మెత్తగా పేస్టులాగా చేసి అందులోకి కాస్త పసుపు మిక్స్ చేసి ముఖానికి పట్టించుకోని 20 నిమిషా ల పాటు ఆరిన తర్వాత ముఖాన్ని కడుక్కున్నట్లు అయితే ముఖం పై ఉండే మొటిమలు, జిడ్డు చర్మం తొలగిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: