ఇక సాధారణంగా మహిళలు భావోద్వేగపరంగా చాలా వీక్ గా ఉంటారని చాలా మంది నమ్ముతారు. అయితే డిప్రెషన్ సమస్య ఆడవారిలో కంటే పురుషుల్లోనే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే మహిళలు చాలా ఈజీగా తమ కష్టాలను ఇతరులతో చెప్పుకుంటారు. కానీ పురుషులు మాత్రం అసలు అమ్మాయిల్లా కాదు. వారి భావాలను ఎవరికీ కూడా చెప్పుకోరు. దీంతో వారు లోపల చాలా ఉక్కిరిబిక్కిరి అవుతారు. దీంతో వారు డిప్రెషన్ బారిన పడొచ్చు.అందుకే వీలైనంత వరకు కూడా ఏదైనా సమస్య లేదా కష్టంగా అనిపిస్తే.. ఖచ్చితంగా మీ భావాలను ఇతరులతో చెప్పుకోండి. ఎందుకంటే ఇది మీ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనివల్ల మీకు ఒత్తిడి కూడా తగ్గుతుంది.గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం మహిళల్లో కంటే పురుషుల్లో చాలా ఎక్కువగా ఉంటుందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఎందుకంటే పురుషులే అధిక కొలెస్ట్రాల్ స్థాయిలతో చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. అందుకే వీళ్లు ఎప్పటికప్పుడు ఖచ్చితంగా హెల్త్ చెకప్స్ చేయించుకోవాలి.
ఇంకా అలాగే మహిళలతో పోలిస్తే పురుషులే ఎక్కువగా బయటి ఫుడ్ ఇంకా ఆయిలీ ఫుడ్ ను తింటారు. దీని వల్ల వారి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి (Cholesterol level) చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఇది తరువాత ఖచ్చితంగా మధుమేహానికి (diabetes)కారణమవుతుంది. అందుకే మీరు ఎప్పుడూ కూడా ఆరోగ్యకరమైన ఆహారాన్నే తినాలి. అలాగే క్రమం తప్పకుండా మీ రక్తంలో చక్కెర స్థాయిని ఎప్పుడూ చెక్ చేస్తూ ఉండాలి.ఇంకా అలాగే మద్యం సేవించే వ్యసనం మగవారికి కాలేయ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది.దీని వల్ల వారి కాలేయం చాలా ఎక్కువగా ప్రభావితమవుతుంది. దీంతో కాలెయ సంబంధిత రోగాలు చాలా ఈజీగా వస్తాయి.ఇంకా మహిళల కంటే పురుషులే ఎక్కువగా ధూమపానం (Smoking) చేయడం మీరు తరచుగా చూసే ఉంటారు. అలాగే ఇంటి నుంచి బయటకు రావడం వల్ల వారు ఎక్కువ దుమ్ము ఇంకా అలాగే కాలుష్యానికి ఎక్కువగా గురవుతారు. ఈ విధంగా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు కూడా పురుషులకే చాలా ఎక్కువగా వస్తాయి.