ఉదయం లేవగానే అలా టీ తాగుతున్నారా.. అయితే ప్రమాదమే..!!

Divya
ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో ఎవరికైనా టీ తాగే అలవాటు ఉండనే ఉంటుంది. ఉదయం టీ, కాఫీ వంటి పానీయాలు తాగడం వల్ల అస్సలు మంచిది కాదని వైద్యులు తెలియజేస్తున్నారు. చాలా మంది ఉదయం లేవగానే టీ తాగకుండా ఉండకుండా ఉండలేరు. కానీ ఉదయం లేవగానే టీ తాగే వారికి అసిడిటీ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. అసిడిటీకి ప్రధాన కారణం ఖాళీకడుపుతో టీని తాగడం ముఖ్య కారణం. ఉదయం టీ మన ఆరోగ్యాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుందట. పళ్ళు తోముకో కుండా ఎవరైనా టీ తాగితే నోటిలో ఉండే చెడు బ్యాక్టీరియా పేగుల లోకి వెళ్లి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఉదయం పూట టీ తాగితే జరిగే పరిణామాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1). ఉదయం టీ తాగడం వల్ల మన కడుపులో ఆల్కలీన్ బ్యాలెన్స్ దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో పలు సమస్యలు వస్తాయి.
2). ఉదయం నిద్రలేవగానే టీ తాగడం వల్ల ఇతర పోషకాలను కూడా నిరోధిస్తుంది.
3). ఉదయాన్నే కాఫీ లేదా టీ తాగిన వారు నోటిలోని బ్యాక్టీరియా పేగుకు చేరుకుంటుంది.

4). ఉదయం పూట టీ తాగితే ఎక్కువగా మన శరీరంలో ఉండే మెటబాలిక్ సిస్టం పై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనివల్ల అధికంగా కడుపునొప్పి రావడం,  జీవక్రియ పై  ఎఫెక్ట్ చూపుతుంది.
5). ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల అల్సర్, స్కెలిటల్ ఫ్లోరోసిస్ అనే వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి వల్ల ఎముకలు చాలా బలహీనంగా మారే అవకాశం ఉంటుంది.
అయితే టీ , కాఫీ ఎప్పుడు తాగాలి అంటే.. ఉదయం అల్పాహారం తీసుకున్న ఒక గంట తర్వాత టీ , కాఫీలు తాగవచ్చు.. భోజనం  చేసిన తర్వాత రెండు గంటలకు ఈ టీ నీ తాగడం మరీ మంచిది. కానీ ఇలాంటి వాటిని ఎప్పుడూ ఖాళీ కడుపుతో తాగకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: