దాల్చిన చెక్క : అతిగా వాడితే సమస్యలు తప్పవు!

Purushottham Vinay
ఇక వంట గదిలో కచ్చితంగా ఉండే వస్తువుల్లో దాల్చిన చెక్క ప్రధానమైనదని చెప్పాలి. కూరకు మంచి రుచి రావడానికి ఈ మసాలా దినుసు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని గురించి మనందరికీ కూడా తెలిసిందే. ఇది కేవలం రుచే కాకుండా దీని వల్ల ఆరోగ్యప్రయోజనాలు కూడా చాలా ఉంటాయి. ముఖ్యంగా శరీరంలోని కొవ్వును కరిగించడంలో దాల్చిన చెక్క మంచి కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని సుగుణాలు వివిధ వ్యాధుల బారి నుంచి కూడా కాపాపాడుతాయి.అయితే ఇక అతి ఎప్పుడూ ప్రమాదకరమే అన్నట్లు దాల్చిన చెక్క వల్ల లాభాలు ఉన్నప్పటికీ అతిగా తీసుకుంటే మాత్రం నష్టాలు ఖచ్చితంగా ఉంటాయని మీకు తెలుసా.? దాల్చిన చెక్కను స్థాయికి మించి తీసుకుంటే కలిగే ఆ నష్టాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓసారి చూసేయండి..దాల్చిన చెక్కని మోతాదుకు మించి తీసుకుంటే జీర్ణ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కడుపులో మంట ఇంకా అలాగే అల్సర్‌లకు దారి తీసే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే సిన్నమాల్డిహైడ్‌ అనే ఆర్గానిక్‌ కాంపౌండ్‌ నోటి అల్సర్లకు కూడా ఎక్కువగా దారి తీస్తుందని చెబుతున్నారు.


అలాగే దాల్చిన చెక్కను అతిగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి కూడా అమాంతం పడిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే బీపీ లెవల్స్ కూడా తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల మైకం ఇంకా అలాగే మత్తుగా అనిపిస్తుంది.అలాగే కాలేయం ఆరోగ్యాన్ని కూడా దాల్చిన చెక్క దెబ్బ తిస్తుంది. ఇంకా మితిమీరి తీసుకుంటే దీనిలో ఉండే కొమారిన్‌ వల్ల లివర్‌పై ప్రతికూల ప్రభావం కూడా చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక గ్యాస్‌ సమస్యతో బాధపడే వారు కూడా దాల్చిన చెక్క వినియోగాన్ని తగ్గిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే శ్వాస కోశ సమస్యలకు కూడా దాల్చిన చెక్క అతి వినియోగం అనేది చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.కాబట్టి మితంగా తీసుకోండి.ఆరోగ్యంగా వుండండి. లేకుంటే పైన చెప్పిన ఆనారోగ్య సమస్యలు తప్పవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: