సకాలంలో తినట్లేదా? అయితే ఈ ప్రమాదం వుంది!

Purushottham Vinay
ఇక ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా తినాలి. అది కూడా సమయం ప్రకారం.. ఉదయం, మధ్యాహ్నం ఇంకా అలాగే రాత్రి పూట.. రోజుకు మూడుసార్లు తిన్నప్పుడే మీరు ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉంటారు.అది అసలు కూడా క్రమం తప్పకూడదు. పొద్దున్న పూట బ్రేక్ ఫాస్ట్ ను ఎక్కువగా చేయాలి. మధ్యాహ్నం పూట తేలికపాటి భోజనం చేయాలి. ఇక రాత్రి పూట అయితే చాలా తక్కువగా తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మనం సకాలంలో తినకపోతే.. మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.సమయానికి ఆహారం తినకపోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని ప్రతి ఒక్కరికీ తెలుసు. అయినా కానీ తిండిని నిర్లక్ష్యం చేసే వారు చాలా మందే ఉన్నారు. అందులో కూడా ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ గ్యాస్ట్రిక్, గుండెల్లో మంట ఇంకా ఎసిడిటీ మొదలైన వాటితో బాధపడుతున్నారు.ఇక ధమనిలో అడ్డంకి కారణంగా మెదడుకు రక్తం ఇంకా ఆక్సిజన్ సరఫరా సరిగ్గా జరగపోతే పక్షవాతం బారిన పడే అవకాశం ఉంది. అధిక కొలెస్ట్రాల్ నుంచి సంతృప్త , ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న ఆహారం నుంచి ధూమపానం ఇంకా ఆల్కహాల్ తీసుకోవడం వంటివి స్ట్రోక్ కు దారితీసే ప్రధాన కారణాలు.


జర్నల్ న్యూట్రియెంట్స్ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే సాయంత్రం భోజన సమయం స్ట్రోక్ ప్రమాదంపై ప్రభావం చూపుతుందట.అలాగే భోజన సమయం స్ట్రోక్ ప్రమాదాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది.. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారు మూడు గ్రూపులుగా విభజించబడ్డారు. రాత్రి పూట 8 గంటలకు ముందు తినేవారు, క్రమరహితంగా తినేవారు ఇంకా రాత్రి 8 గంటల తర్వాత తినేవారు. వీరిలో సరైన సమయానికి భోజనం చేసిన వారు కాకుండా అసమాన స్థాయిలో కూడా భోజనం చేసిన వారికే హెమరేజిక్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు కనుగొన్నారు.పుర్రెలోని ఒక రక్తనాళం మెదడులోకి ప్రవేశించి రక్తస్రావం అయినప్పుడు ఇక ఇలా జరుగుతుంది. అలాగే రాత్రి 8 గంటలకు ముందు భోజనం చేసిన వ్యక్తులకు కాకుండా ఇంకా సమయం సదర్భం లేకుండా (క్రమ రహితంగా)తినే వాళ్లకే స్ట్రోక్ ప్రమాదం ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు తేల్చారు. అలాగే అధిక బరువు ఉండేవారు కూడా దీనిబారిన పడొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: