చిక్కుడుకాయ తింటున్నారా.. ఈ విషయం తెలుసుకోండి?
ఇక ఇలా ప్రతి ఒక్కరు ఇష్టపడే కూరగాయలలో అటు చిక్కుడుకాయ కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. ఎంతోమంది చిక్కుడు కాయ కర్రీ తినడానికి ఇష్టపడుతుంటారు. ఇక పల్లెటూర్లకీ వెళ్తే మార్కెట్ లోకి వెళ్లి చిక్కుడుకాయ తీసుకోవడం కాదు ప్రతి ఇంటి ముందు కూడా చిక్కుడుకాయ చెట్టు ఉంటుంది. ఏకంగా ఇంటి ముందు పండించిన చిక్కుడుకాయను కూరగా వండుకొని తింటుంటారు. అయితే చిక్కుడుకాయ లో ఎలాంటి పోషకాలు ఉంటాయి అన్నది మాత్రం చాలా మందికి తెలియదు. ఈ క్రమంలోనే చిక్కుడు కాయ తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి అంటూ చెబుతున్నారు నిపుణులు.
చిక్కుడు కాయ కర్రీ తినడం వల్ల అది చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది అంటూ వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా నిద్రలేమి ఒత్తిడిని కూడా దూరం చేస్తుంది అంటూ చెబుతూ ఉండటం గమనార్హం. అయితే సాధారణంగా ఎంతో మంది మహిళలు రక్తహీనతతో బాధ పడుతూ ఉంటారు. ఇక అలాంటి వారు క్రమం తప్పకుండా చిక్కుడు కాయ కర్రీ తినడం వల్ల ఇది ఒక మంచి ఔషధంగా పని చేస్తుంది అంటూ చెబుతున్నారు నిపుణులు. అంతేకాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అంటూ ఉన్నారు. ఇక మెదడు పనితీరును కూడా చిక్కుడుకాయ మెరుగుపరుస్తుందట..