ఈ గింజలతో మధుమేహానికి శాశ్వతంగా చెక్ పెట్టొచ్చు!

Purushottham Vinay
మధుమేహం చాలా సర్వసాధారణమైంది. మరోవైపు శరీరంలో తాగినంత నీటి శాతం ఇంకా ఫైబర్‌ కంటెంట్‌ లేకపోవడం వల్ల మలబద్ధకం సమస్య అనేది వస్తుంది. సకాలంలో వైద్యులను సంప్రదించకపోతే చాలా ఇబ్బందిగా మారుతుంది. ఇక వాటి ప్రభావాన్ని తగ్గించడానికి, లేదా ఉపశమనం కోసం ఇంటి చిట్కాలు పాటించడం చాలా మేలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యానికి సంబంధించి ఆయుర్వేదంలో ఎన్నో మేలు చేసే చిట్కాలు ఉన్నాయి. షుగర్ వ్యాధిని తొలగించలేము  కానీ దానిని మాత్రం మనం అదుపులో పెట్టుకోవచ్చు.సబ్జా గింజలు చాలా మేలు చేస్తాయి. ఇందులో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వు ఇంకా అలాగే పిండి పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. ఇంకా చియా సీడ్స్‌తో పోల్చినట్లయితే, ఇందులో ప్రొటీన్లు ఎక్కువగా ఉన్నాయని, కేలరీలు లేవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీకు తరచుగా మలబద్ధకం సమస్య కనుక ఉంటే సబ్జా గింజలను రోజూ తీసుకోండి. ఇందులో పీచు ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం నుండి మంచి ఉపశమనం పొందవచ్చు.




అదనంగా సబ్జా గింజలు కిడ్నీల నుండి ఇన్ఫెక్షన్స్‌ను తొలగించే మంచి సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటాయి.డయాబెటిస్‌తో బాధపడుతున్నవారికి ఈ సబ్జా గింజలతో ఎంతో మేలు ఉంటుంది. సబ్జా గింజలలో మధుమేహాన్ని నియంత్రించే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో ఇది చాలా ప్రభావవంతంగా పని చేస్తాయి. అంతేగాక ఇవి హై బీపీని కూడా కంట్రోల్‌ చేస్తాయి.తక్కువ నీరు త్రాగడం ఇంకా ఆహారంలో మార్పుల కారణంగా యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా సంభవించవచ్చు. అయితే హైడ్రేషన్ లోపమే దీనికి ప్రధాన కారణం. యూరిన్ ఇన్ఫెక్షన్ కోసం ఎక్కువ నీరు తాగడమే కాకుండా సబ్జా గింజలను కూడా తినండి. ఇది మూత్రంలో ఉన్న ఇన్ఫెక్షన్‌ను తొలగించడం ద్వారా దానిని శుభ్రపరచడంలో బాగా సహాయపడతాయి.కాబట్టి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు వున్న సబ్జా గింజలని ఖచ్చితంగా తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: