నిద్ర తక్కువైతే.. అలా కూడా జరుగుతుందట?
కానీ ఇప్పటి కాలంలో మాత్రం నిద్ర పోవడానికి అంతా సమయం కేటాయించలేం గురూ ఎందుకంటే బిజీ లైఫ్ అంటూ సమాధానం చెబుతున్నారు జనాలు. కానీ నిద్ర లేమి కారణంగా ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అన్నది తెలిసిందే. ఇటీవలే ఒక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. నిద్ర తక్కువైతే ఇతరులను తప్పుగా అంచనా వేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారంట. అంతే కాదు సామాజిక ప్రతికూలతలను కూడా ఎదుర్కోవలసి వస్తుందని ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. స్వీడన్కు చెందిన ఉపసళ విశ్వవిద్యాలయం పరిశోధకులు 45 మంది వాలంటీర్లతో ఒక అధ్యయనాన్ని చేపట్టారు.
ఇక ఇందులో భాగంగా ఒకరోజు ఏమాత్రం నిద్రపోకుండా ఇతరుల ముఖలను చూసిన వారు ఎలా ఫీలయ్యారు అన్నది గుర్తించారు. ఇక మరో రోజూ ఎనిమిది గంటలపాటు నిద్రపోయిన తర్వాత వారి ముఖాలను గమనించి అంచనా వేశారు. ఇలా ఇటీవలే ఇక పరిశోధనలో వెల్లడైన విషయాలను శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇక ఇందులో ఐ ట్రాకింగ్ సెన్సార్ సాంకేతికతను వినియోగించడం గమనార్హం. సరిగ్గా నిద్రపోని వారు కోపంతో ఉన్న ముఖాలను చూసి వారిని తక్కువగా విశ్వసనీయత ఉన్న వ్యక్తులు ఆరోగ్యవంతులుగా గుర్తించారు. ఎలాంటి భావాలు కనిపించని తటస్థ ముఖాలు.. వారి అతి తక్కువ ఆకర్షణీయమైన వ్యక్తులుగా పరిగణించారు. ఇక ఇలాంటి తప్పుడు భావాలు సామాజిక బంధాల పైన ప్రభావం చూపుతాయని సైంటిస్టులు చెబుతున్నారు.