ఈ కారణాల వల్లే వినికిడి లోపం వస్తుందని మీకు తెలుసా..?

Divya
బిజీ లైఫ్ స్టైల్లో చాలా మంది వారికి తెలియకుండానే వినికిడి లోపానికి గురి అవుతున్నారు అన్న విషయం చాలామందికి తెలియదు అని చెప్పాలి. ఇక ముఖ్యంగా బిగ్గరగా టీవీ చూడడం, పాటలు గట్టిగా వినడం, సౌండ్ ఎక్కువగా పెట్టుకొని టీవీ చూడడం, బిగ్గరగా మాట్లాడటం వంటివి వినికిడి లక్షణాలుగా చెప్పవచ్చు. ఇక వీటిని ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స తీసుకుంటే సమస్య పెద్దది కాదు అని చెప్పవచ్చు.నిజానికి వినికిడి లోపం రావడానికి వయసుతో సంబంధం లేదు. ఏ వయసులోనైనా ఒకసారి వినికిడి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.

 ఇక ముఖ్యంగా వయస్సు పెరిగే కొద్దీ వినికిడి లోపం తగ్గడం సహజం కాబట్టి 60 సంవత్సరాలు పైబడిన వారిలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుందట. అలాగే మీ కుటుంబంలో ఇంతకు ముందు ఎవరైనా చెవిటివాడు ఉండడం.. చెవి పోటు, చెవి నిర్మాణంలో లోపాలు పెద్ద శబ్దాలు చేసే యంత్రాలు దగ్గర పనిచేయడం ఇలాంటి కొన్ని కారణాల వల్ల వినికిడి లోపం వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇలాంటి కారణాల వల్ల వినికిడి లోపం వస్తుంది అనే విషయానికి వస్తే..తరచుగా చెవులను తడి గా ఉంచుకోవడం అస్సలు మంచిది కాదు. ఫలితంగా చెవిలో ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈతగాళ్లకు ఇలాంటి సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.


ఇక చెవుల్లో ఇయర్ బడ్, పిన్ లను అస్సలు పెట్టుకోకూడదు. స్నానం చేసేటప్పుడు చెవిలో నీరు పోయడం లాంటివి మానుకోవాలి. పెద్ద శబ్దాల దగ్గర పని చేసేటప్పుడు కూడా చెవిలో దూది పెట్టుకోవడం ఇలాంటివి చేయడం ఉత్తమం.. ఇక బిగ్గరగా టీవీ చూడడం, పాటలు వినడం లాంటివి అసలు చేయకూడదు. కొంతమందికి బిగ్గరగా సంగీతం వినడం ఇష్టం ఉంటుంది. ఇలా చేయడం వల్ల చెవి పనితీరు సామర్థ్యం తగ్గుతుంది. కాబట్టి  వినికిడి శక్తి క్రమంగా తగ్గిపోతుంది కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు  తీసుకున్నట్లయితే  వినికిడి లోపం సమస్య దూరమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: