ఎక్కువసేపు ఏసీలో ఉంటున్నారా.. అయితే జాగ్రత్త సుమి..!!

Divya
పెరుగుతున్న వేడి ప్రభావం వల్ల ప్రతి ఒక్కరు చెమట నుంచి ఉపశమనం పొందడానికి ఎక్కువగా ఏసీని ఉపయోగించుకుంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం మనిషికి ఈ ఏసి అనేది చాలా వ్యసనంగా మారిపోతోంది. ఇల్లు ,ఆఫీస్ ,కార్ ఇలా ప్రతి ఒక్క చోట ఎయిర్ కండిషన్ ని ఉపయోగించుకుంటున్నారు. ప్రస్తుతం ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ చేరడంతో ప్రజలు ఏసీ లేకుండా కొద్దిసేపు కూడా ఉండలేకపోతున్నారు అని చెప్పవచ్చు. అయితే ఈ ఎయిర్ కండిషన్ వ్యసనం మన శరీరాన్ని చాలా దారుణంగా ప్రభావితం చేస్తుందట.


1).ఎక్కువసేపు ఏసీలో ఉండటంవల్ల.. ముక్కు , గొంతు సంబంధిత వ్యాధులు వస్తాయట. అంతేకాకుండా శ్వాసకోస సమస్యలను ఎదుర్కోవాల్సి కూడా ఉంటుంది.


2).ఆస్తమా అలర్జీలతో బాధపడేవారు ఎక్కువగా ఏసి ఉపయోగించుకోవడం చాలా ప్రమాదకరం. అయితే కాలుష్యాన్ని నివారించేందుకు తరచుగా ప్రతి ఒక్కరు ఇంట్లో ఏసీని ఉపయోగించుకుంటున్నారు కాని ఏసి శుభ్రం చేయకపోతే ఆస్తమా , అలర్జీ తో బాధపడే వారికి ఇబ్బందులు వస్తాయట.

3).ఎక్కువగా ఏసీ కింద ఉండడం వల్ల మొక్కలు పొడిబారిపోయి శ్లేష్మ పొరల సమస్య వస్తుందట.

4).గది ఉష్ణోగ్రత తో పోలిస్తే ఏసీలో నివారించలేని వారిలో డీహైడ్రేషన్ సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తోందట.


5). ఈ ఏసి వల్ల వచ్చే డీహైడ్రేషన్ సమస్య వల్ల తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. ఏసీ లో ఉండి వెంటనే ఎండలోకి వెళితే చాలా మందికి తలనొప్పి సమస్యలు వస్తున్నాయని వైద్యులు తెలియజేస్తున్నారు.

6). కళ్ళు పొడిబారడం:
మీలో ఎవరికైనా సరే కళ్ళు పొడిబారడం వంటి సమస్యలు ఉంటే ఎక్కువ సేపు ఏసీలో ఉండటం మంచిది కాదు. ఇక కళ్ళల్లో దురద ,అసౌకర్యం వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. ముఖ్యంగా డ్రై ఐస్ సిండ్రోమ్ సమస్యతో బాధపడే వారు అసలు ఏసీలో ఉండకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఇక అంతే కాదు పొడిచర్మం ఉన్నవారు కూడా ఏసి కింద ఎక్కువసేపు ఉండక పోవడమే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: