గుర్తుంచుకోండి.. రేపే పల్స్ పోలియో?
ఇక ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అంతేకాకుండా మీ పిల్లల భవిష్యత్తు బంగారు బాటలు వేసేందుకు పోలియో ని తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని తల్లిదండ్రులకు సూచిస్తుంది ప్రభుత్వం. ఇకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్కేంద్రాలు, అంగన్వాడీలు, ప్రభుత్వ పాఠశాలలు, బస్టాండ్లు రైల్వేస్టేషన్లు ఎయిర్పోర్టులో ఇతర ప్రాంతాలలో కూడా పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలంగాణ వైద్య శాఖ వెల్లడించింది. రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి పల్స్ పోలియో కార్యక్రమం జరగబోతున్నది తెలుస్తోంది.
ఇక రాత్రి 8 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం జరగనుంది. ఇక ఎవరైనా ఆదివారం రోజున అందుబాటులో ఉండక పోలియో చుక్కలు వేయించుకోకపోతే సోమవారం రోజు ఉదయం కూడా పోలియో చుక్కలు వేస్తారని ప్రభుత్వం తెలిపింది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి అంటూ తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు సూచించారు. తెలంగాణలో దాదాపు 38లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. నేటి రోజుల్లో ఎంతో మంది తల్లిదండ్రులు పల్స్ పోలియో విషయంలో నిర్లక్ష్యం వహించడం కారణంగా వారి పిల్లల జీవితాన్ని చేతులారా దుర్భరంగా మార్చుతున్నారు అన్న విషయం తెలిసిందే. మీరు మాత్రం అలా చేయకుండా తప్పనిసరిగా మీ పిల్లలకు పల్స్ పోలియో వేయించడం ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు.