'కోపం' కంట్రోల్ కాకపోతే... ఎంత నష్టమో తెలుసా?

VAMSI
మనకు కోపం ఊరకనే వచ్చేస్తుంది, మన ఆగ్రహాన్ని ఇతరులపై చూపించి కంట్రోల్ లో పెట్టడం మన గొప్పతనం అని చాలామంది అనుకుంటుంటారు. కానీ ఆ కోపం, ఇతరులపై కలిగే అసూయ, ద్వేషం ఇవన్నీ మనకు తెలియకుండానే ఎంతటి ప్రభావాన్ని కలిగిస్తాయో మన ఆయుష్షు ఎంతగా తగ్గిస్తాయో అన్నది అర్దం చేసుకుని మసలుకుంటే మనం ఆరోగ్యంగా ఆనందంగా జీవించవచ్చు. ప్రశాంతంగా జీవిస్తూ ఆయుస్సును పెంచుకోవచ్చు. మనిషి గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది అన్న విషయం తెలిసుంటుంది. అలాగే ఒక రోజుకి 7000 లీటర్లు రక్తాన్ని గుండె పంప్ చేస్తుంది.

మాములుగా వాటర్ ట్యాంక్ 1000 లీటర్ల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అలాంటిది అంతకు ఏడింతలు రక్తాన్ని గుండె ఒక రోజుకి పంప్ చేయడం అంటే చిన్న విషయమా. ఈ రక్తంలో 70% మెదడుకి పంప్ చేయగా, 30% మిగతా శరీర అవయవాలకు పంప్ చేస్తుంది గుండె. గుండె ఒక్కసారి కొట్టుకోటానికి 0.8 సెకన్ల సమయం పట్టుతుంది. ఈ సమయంలో 0.3 సెకనులు సంకోచించటానికి అలాగే 0.5 సెకన్ల సమయం వ్యాకోచించటానికి ఇక్కడ వ్యాకోచం అంటే గుండె రిలాక్స్ అయ్యే సమయం అన్నమాట. ఈ 0.5 సెకన్ల టైమ్ లో రక్తం ఊపిరి తిత్తులకు వెళ్లి శుభ్రపడడం జరుగుతుంది.

ఈ రిలాక్స్ టైమ్ కనుక తగ్గితే రక్తం ఊపిరితిత్తులకు వెళ్లి పూర్తిగా శుభ్ర పడటం కూడా జరగదు. ఒకవేళ మనం కానీ టెన్షన్ లో గానీ కోపంతో గానీ ఉంటే మన మెదడుకి ఎక్కువ రక్తం అవసరమవుతుంది. అప్పుడు గుండె తక్కువ రిలాక్స్ అయ్యి ఎక్కువ సమయం రక్తాన్ని పంప్ చేయాల్సి ఉంటుంది. 0.5 సెకన్లకు బదులుగా 0.4 సెకన్ల టైమ్ మాత్రమే రిలాక్స్ అవుతుంది. తద్వారా గుండె ఒక బీట్ కి 0.8 కి బదులు 0.3 + 0.4 = 0.7 టైమ్ మాత్రమే తీసుకుంటుంది. అలా నిమిషానికి 84 సార్లు కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గుండెకి విశ్రాంతి 20% తగ్గుతుంది. రక్తం పూర్తి స్థాయికి బదులు 80% మాత్రమే శుభ్రపడుతుంది. దీని వలన మన ఆరోగ్యం మన చేతులారా మనమే పాడు చేసుకుంటున్నాం. కావున ఈ సెన్సిటివ్ విషయాన్ని గ్రహించి మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి... కోపాన్ని కంట్రోల్ చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: