బరువు తగ్గడానికి రోజులో ఎంత సమయం నడవాలి?

VAMSI
రోజు రోజుకీ మారుతున్న ఈ పాశ్చాత్య సంస్కతి వంట పట్టించుకున్న రోజుల్లో వివిధ రకాల ఆహారపు అలవాట్లు మరియు పనిచేసే వాతావరణం మరియు విధానం లాంటి పలు కారణాల వలన భారీగా బరువు పెరుగుతున్నారు. ముఖ్యంగా ఈ సమస్య యువకులలో కనిపించడం కాస్త ఆందోళనకరంగా ఉంది. మరి పెళ్లి కానీ యువకులకు ఇదొక మానసిక సమస్యగా తయారయింది. అందుకే ఎలాగైనా బరువు తగ్గించుకోవాలి అని ఏవేవో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అయితే అందరికీ సమయం అనుకూలించక కొన్ని ఫాలో అవడం కష్టంగా ఉంటుంది. అయితే అటువంటి వారికి తమకు కుదిరిన సమయంలో నడవడం వలన బరువు తగ్గించుకోవచ్చు అని తెలుస్తోంది.
అయితే నడవడం అంటే ఏదో అలా కాలయాపన చేయడం కాదు. ఒక పద్దతి ప్రకారం నడిస్తేనే ఫలితం ఉంటుంది.
* మీ శరీర బరువు ఒక రోజుకు కనీసం 90 నిముషాల పాటు నడవాల్సి ఉంటుంది.
* అంతే కాకుండా నడవడం అంటే నిదానంగా కాదు. వేగంగా శరీరం అంతా కూడా కదలాలి ..మీరు నడిచే వేగాన్ని బట్టి కేలరీలు ఖర్చు అవుతాయి.
* ఫాస్ట్ గా నడవడం వలన ఊపిరి పీల్చుకునే విధానంలో మార్పు ఉంటుంది. తద్వారా శ్వాసవ్యవస్థ బాగుంటుంది.  
*అర గంట పాటు నడిస్తే 300 కేలరీలు ఖర్చు అవుతాయని తెలుస్తోంది
*  మీకు ఏమైనా గుండె సంబంధిత సమస్యలు ఉంటే డాక్టర్ యొక్క సలహా తీసుకుని వాకింగ్ చేయవచ్చు.
* ఒకవేళ డాక్టర్స్ నడవొచ్చు అని చెబితే మీరు ఎప్పటి కప్పుడు హర్ట్ రేట్ ను చెక్ చేసుకుంటూ ఉండడం మంచిది. దీని కోసం ఫిట్నెస్ బ్యాండ్ మీతో ఉంచుకోవాలి.
* వాకింగ్ అలవాటు లేని వారు... ఎక్కువ దూరం వెళ్ళకూడదు. మొదటి వారం రోజుల వరకు కనీస దూరాన్ని మాత్రమే టార్గెట్ గా పెట్టుకోవాలి, అలవాటు అయ్యే కొద్దీ దూరాన్ని పెంచుకోవాలి.
* కొందరు ఒకటి రెండు రోజులు వాకింగ్ చేసి మళ్లీ మానేస్తూ ఉంటారు. ఇలా చేయడం వలన ఉపయోగం ఉండదు.`  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: