వైరస్ ని అంతం చేసే సూపర్ ఫుడ్..!!

Divya
ప్రస్తుతం రెండు మూడు సంవత్సరాల నుంచి కరోనా.. దేశాల ప్రజలందరినీ ముప్పతిప్పలు పెట్టిన విషయం తెలిసిందే. ఇకపోతే ఒమిక్రాన్ ప్రస్తుతం రోజురోజుకూ ఎక్కువ అవుతోందని.. వైద్యులు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ వైరస్ మనకు సోకకుండా మనం తీసుకునే ఆహారంలో పోషకాలు పెంపొందించుకుంటే తప్పకుండా వైరస్ బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండగలమట. అయితే ఏ ఏ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.. అంటువ్యాధులు రాకుండా ఉంటాయో ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం.

మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే మినరల్స్ కూడా తగిన మోతాదులో తీసుకోవాల్సిందే.. మనం తీసుకునే ఆహారంలో ఫైబర్, క్యాల్షియం, జింక్ , విటమిన్స్, ప్రోటీన్స్, పీచు పదార్థాలు వంటివి తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ఇకపోతే మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి అన్నా.. వైరస్ మన శరీరంలోకి చేరకుండా ఉండాలి అన్నా..తప్పకుండా జింక్ తీసుకోవాలి. ఇకపోతే జింక్ అనే ఖనిజాన్ని మనం తీసుకోవడం వల్ల మన శరీరంలో ఎలాంటి పనులను నిర్వహిస్తుంది అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

శరీరానికి అవసరమైన జింక్ తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ సంబంధిత ప్రక్రియలో కీలక పాత్ర వ్యవహరిస్తుంది. గాయాలను నయం చేయడానికి.. డీఎన్ఏ సమన్వయానికి.. శ్లేష్మ  విభజనకు , ప్రోటీన్ విశ్లేషణకు, హైపోథైరాయిడ్ నివారణకు, హృదయ సంబంధిత వ్యాధుల నుంచి మనల్ని రక్షించడానికి, చర్మ ఆరోగ్యానికి, రుచి, వాసన పసిగట్టడానికి , జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను దూరం చేయడానికి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల సమస్యలకు సూపర్ ఫుడ్ గా ఈ జింక్ మనకు పని చేస్తుంది. అంతేకాదు అంటువ్యాధులతో పోరాడి మనకు రక్షణ కల్పించడంలో ఈ జింక్ సమర్థవంతంగా పనిచేస్తుంది అని ప్రపంచవ్యాప్త పరిశోధనల్లో తేలడం గమనార్హం.
ఇక రోజుకి మహిళలకు 8 గ్రాముల జింక్ అవసరమైతే.. పురుషులకు 11 గ్రాములు జింక్ అవసరమవుతుంది. ఇక గర్భం దాల్చిన మహిళలు అయితే రోజుకి 11 గ్రాములు.. పాలిచ్చే తల్లులు అయితే 12 గ్రాముల జింక్ తప్పనిసరిగా తీసుకోవాలి. జింక్ ఎక్కువగా లభించే ఫుడ్ విషయానికి వస్తే పౌల్ట్రీ ఉత్పత్తులు, నత్తలు, మాంసాహారంలో ఎక్కువగా లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: