వారానికి రెండు సార్లు సెక్స్ చేస్తే క‌రోనా ఖ‌తం..!

VUYYURU SUBHASH
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని రెండు సంవత్సరాలుగా తీవ్రంగా అతలాకుతలం చేస్తోంది. ఇప్పుడు ప్ర‌పంచం కాస్త కుదుట ప‌డుతోంది అనుకుంటున్న సమయంలో ఒమిక్రాన్ వైరస్ ప్రపంచంపై తన పంజా విసురుతోంది. విచిత్రమేంటంటే కరోనా నుంచి కోలుకునేందుకు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారిని కూడా ఈ కొత్త వైరస్ వదలటం లేదు. అసలు కరోనా నుంచి తప్పించుకునేందుకు ఏం చేయాలో కూడా ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే అమెరికాకు చెందిన ఒక వైద్యుడు సంచలన విషయాలు బయటపెట్టారు. వారానికి రెండు సార్లు తమ భాగస్వామితో శృంగారంలో పాల్గొంటే కరోనా మీ దరి చేర‌దు అని ఆ వైద్యుడు చెప్పిన విషయాలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైర‌ల్ అవుతున్నాయి.

క‌రోనా నుంచి కోలుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఎవరికి తోచిన ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఎవరికి తోచిన చిట్కాలు వారు పాటిస్తున్నారు. అయితే అమెరికా వైద్యుడు మాత్రం వారానికి రెండు సార్లు శృంగారంలో పాల్గొంటే మీకు క‌రోనా రాదన్న విషయాన్ని తాను ఆధారాలతో సహా నిరూపించాలని బహిరంగంగా చెబుతున్నారు. ఇక ఆయన వ్యాఖ్యలను కూడా ఎవరు ఖండించడం లేదు. కరోనా మొదటి దశ వచ్చిన తర్వాత చాలామంది తమ ఇమ్యూనిటీపవర్ పెంచుకునేందుకు గతంలో ఎప్పుడూ తిన‌ని పదార్థాలను కూడా తినాల్సి వచ్చింది.

కాషాయాల పేరుతో అన్నింటిని కలిపి తాగారు. మరికొందరు చికెన్ - మటన్ తింటే ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెరుగుతుంద‌ని చెప్పడంతో వారానికి రెండు మూడు సార్లు అవి తిన్నారు. చాలామంది నాటు వైద్యం ... ఆకు పసరు తాగటం ... ఆకులు తినటం చేశారు. అయితే అమెరికాలోని అరిజోనా కు చెందిన డాక్టర్ ఫెయిల్ ఫోన్ ఓ నెటిజ‌న్ వేసిన ప్రశ్నకు వారానికి రెండు సార్లు శృంగారంలో పాల్గొంటే రోగనిరోధకశక్తి 30 శాతం పెరుగుతుంది అని చెప్పారు.

2004లో జరిగిన ఓ అధ్యయనంలో సెక్స్ చేయడం వల్ల శరీరంలో ఇమ్యూనోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయని తేలింద‌ట‌. దీని వ‌ల్ల శ‌రీరం రోగ నిరోధ‌క శ‌క్తిని క‌లిగి ఉంటుంద‌ట‌. మ‌రి ఈ అధ్య‌య‌నం ఎంత వ‌ర‌కు నిజ‌మో ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: