డాక్టర్ లు చెప్పిన ప్రకారం మందులు వేసుకోవడం లేదా? అయితే ప్రమాదమే?

VAMSI
ఒకప్పటి కాలం వేరు ఇప్పటి కాలం వేరు...ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకి ప్రజలు హాస్పిటల్ కు పరుగులు తీస్తున్నారు. ఆఖరికి చిన్నపాటి తలనొప్పికి కూడా మందులు, మాత్రలు వేసుకుంటున్నారు. అలా ఏదైనా జబ్బు చేస్తే హాస్పిటల్ కి వెళ్ళడం, వెళ్ళాక డాక్టర్లు వాటికి తగ్గ మందులు, మాత్రలు రాసివ్వడం వాటిని వేసుకోవడం పరిపాటి అయిపోయింది. అయితే కొన్ని మాత్రలను తినకు ముందు వేసుకోవాలని, కొన్ని మాత్రలను తిన్నాక వేసుకోవాలని డాక్టర్లు సూచిస్తుంటారు. కానీ చాలా మందికి తినిన తర్వాత అయితే ఏమి...తిన్న తర్వాత ఏమౌతుంది అని అనుమానం వుంటుంది.
మరి కొందరు అయితే ఎప్పుడేసుకున్న ఒకటేలే టైం కి వేసుకుంటే చాలు అని నచ్చినప్పుడు వేసుకుంటారు. కానీ వైద్యులు చెప్పిన విధంగా అన్నం తినక ముందు, తినిన తరవాత ఏవైతే వేసుకోవాలో వాటినే వేసుకోవాలి. ఎందుకు ఇపుడు తెలుసుకుందాం.
అన్ని మందులు ఒకే రకమైనవి ఉండవు. కొన్ని రక్తంలో కలవాల్సిన అవసరం ఉండదు, అలాంటి మందులు వాడటం వలన మనకు  కడుపులో ఎలాంటి సమస్య రాదు అన్న మందులను మాత్రమే భోజనానికి ముందు వేసుకోవాలని డాక్టర్లు సూచిస్తారు. కాగా ఇంకొన్ని రకాల మందులు మాత్రం రక్తంలోకి చేరి ప్రక్రియ జరిపినప్పుడు అవి కడుపులో కొన్ని రకాలైన రసాయనాలను విడుదల చేయడం ద్వారా వాటి వలన కడుపులో అజీర్తి, వికారం వంటి సమస్యలు వస్తాయి. అందుకనే ఈ రకమైన మందులను ఆహారం తిన్న తర్వాత వేసుకోవాలి అని సూచిస్తారు.
ఆహారం తినడం ద్వారా మనపై పెద్దగా ఆ ప్రభావం ఉండదు. అందుకే తినక ముందు వేసుకోవాల్సిన మందులను తినక ముందే వేసుకోవాలి. తిన్న తరవాత అని చెప్పిన మందులను తిన్న తర్వాతే వేసుకోవాలి. కాబట్టి మీకు డాక్టర్ ఏ విధంగా అయితే మెడిసిన్ వేసుకోమని చెబుతారో యాడ్స్ పద్ధతిలో వేసుకోవాలి. లేదంటే ఆరోగ్యానికి చాలా ప్రమాదం అని గుర్తించుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: