డయాబెటిస్ వారు వంకాయ తింటే ఏమౌతుందో తెలుసా..?

Divya
నాటి కాలం తో పోల్చుకుంటే ఈ మధ్య కాలంలో చాలా మంది మధుమేహం సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఒక్కసారి ఈ సమస్య బారిన పడడం అంటే ఇక మనం చనిపోయే వరకు మందులు తప్పకుండా వాడాల్సిందే. అయితే మందులు వాడుతూ డయాబెటిస్ ను కూడా మనం కంట్రోల్ చేసుకోవడానికి కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటే చక్కటి శుభఫలితాలు కలుగుతాయి.. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న వారిలో ఆహారం అనేది కీలక పాత్ర పోషిస్తుంది.


ఇకపోతే సరైన జీవనశైలి లేకపోవడం.. వ్యాయామం సరిగా చేయలేక పోవడం , అధిక బరువు ,శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాల వల్ల ఈ సమస్య వస్తుంది. అయితే ఇలాంటి వారు ప్రతి రోజూ సరైన ఆహారం తినడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుందట. ఎందుకంటే వంకాయలో ఉండే ఫైబర్ సమృద్ధిగా శరీరానికి అంది రక్తంలో చక్కెర ను నియంత్రిస్తుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజు తమ ఆహారంలో చేర్చుకోవడం వల్ల కొంతవరకు డయాబెటిస్ ను కంట్రోల్ చేసుకోవచ్చు.

వంకాయలో మనకు కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండడం వల్ల మధుమేహ సమస్యతో బాధపడుతున్న వారికి చాలా మంచి చేస్తాయి. అలాగే గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా వంకాయలలో చాలా తక్కువగా ఉంటుంది. అందుకే వంకాయలను తిన్నా కూడా రక్తంలో షుగర్ లెవెల్స్ అనేది పెరగవు. ముఖ్యంగా యాంటీఆక్సిడెంట్స్ కూడా సమృద్ధిగా లభిస్తాయి.. కాబట్టి ఫ్రీరాడికల్స్ తో పోరాడి జబ్బులను దూరం చేస్తాయి. అంతేకాదు గుండె జబ్బులు రాకుండా కూడా వంకాయలు చాలా చక్కగా పనిచేస్తాయి. ముఖ్యంగా ఎవరికైతే డయాబెటిస్ ఉండి గుండె జబ్బులు బారిన పడే అవకాశాలు ఉంటాయో కాబట్టి వంకాయ తినడం వల్ల ఆ సమస్యల నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. కాబట్టి వారానికి రెండుసార్లు డయాబెటిస్ ఉన్నవారు వంకాయలను తినడం వల్ల మంచి ఫలితం ఉండడంతోపాటు కొంతవరకు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: