ఇలా చేద్దాం : ఒమిక్రాన్‌ గుర్తింపు, చికిత్స ఎలా..?

Paloji Vinay
 ప్ర‌పంచ వ్యాప్తంగా అతివేగంగా వ్యాపిస్తున్న‌ ఒమిక్రాన్ వేరియంట్ ను ప్రాథ‌మికంగా ఎలా గుర్తించాల‌నే విష‌యంపై చాలామంది ఆందోళ‌న చెందుతున్నారు. అయితే, ఈ వైర‌స్‌లో సుమారు 32 మ్యూటేష‌న్లు ఉండంతో దానికి ఇప్ప‌టివ‌ర‌కు నిర్ధిష్ట‌మైన ల‌క్ష‌ణాల‌ను శాస్త్ర‌వేత్త‌లు నిర్ధారించ‌లేక‌పోయారు. కానీ, ఇత‌ర దేశాల్లో ప‌రిస్థితులు ఆధారంగా తీవ్ర‌మైన త‌ల‌, ఒళ్లు నొప్పులు.. ఎక్కువగా నీర‌సంగా ఉండ‌డం లాంటి ల‌క్ష‌ణాలు ఉంటాయ‌ని వైద్యులు చెబుతున్నారు. అలా అని ద‌గ్గు, జ‌లుబు, రుచి లేక‌పోడం, జ్వ‌రం లాంటి ల‌క్ష‌ణాలు కూడా రాక‌పోవ‌డం అంటూ ఏం లేద‌ని అంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న దేశాల్లో ఎక్కువ మంది పేషెంట్ల‌కు ఎలాంటి ల‌క్ష‌ణాలు లేక‌పోగా, మిగ‌తా వారికి తీవ్ర‌మైన ఒళ్లు నొప్పులు , నీర‌సం వంటి ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్టు తెలుస్తోంది.


   కరోనా వైర‌స్ ఊపిరితిత్తుల మీద దాడి చేస్తుంది. కాబ‌ట్టి వ్యాధిని స‌త్వ‌రంగా గుర్తించ‌డం అనివార్యం.  అయితే, వేరియంట్ ఏది అయినా ఒకే చికిత్స విధానం అందుబాటులో ఉంది.  ద‌గ్గు, జ్వ‌రం, ఒళ్లు నొప్పులు, జ్వ‌రం వంటి వాటికి సింప్ట‌ మాటిక్ చికిత్స అందిస్తూ..  ఆక్సిజ‌న్ శాతం త‌గ్గిన‌ప్పుడు యాంటీ వైర‌ల్ డ్ర‌గ్స్‌, స్టెరాయిడ్ ట్రీట్‌మెంట్ స‌రిపోతుంద‌ని వైద్యులు చెబుతున్నారు. మ‌రోవైపు ఫైజ‌ర్ కంపెనీ త‌యారు చేసిన యాంటీ వైర‌ల్ డ్ర‌గ్ ఒమిక్రాన్ వేరియంట్ మంచి ప్ర‌భావం చూపెడుతున్న‌ట్టు ఇప్ప‌టి ప్ర‌క‌టించింది.



సుమారు 86 శాతం క్షేమం అని అయితే, దీనిపై మ‌రింత ప‌రిశోధ‌న చేయాల్సి ఉంటుంద‌ని చెబుతున్నారు. వీటితో పాటు కొత్త చికిత్స విధానం మందులు రానున్న రోజుల్లో వ‌స్తాయ‌ని అంచ‌నా వేస్తున్నారు.  అయితే, వైర‌స్ నుంచి ర‌క్ష‌ణ పొంద‌డానికి ప్ర‌జ‌లు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. మాస్కులు ధ‌రించ‌డం, భౌతిక దూరం అవ‌స‌రం ఉన్న‌ప్పుడ‌ల్లా శానిటైజ‌ర్ వాడాల‌ని చెబుతున్నారు. అంద‌రు రెండు డోసుల వ్యాక్సిన్ త‌ప్ప‌కుండా వేసుకోవాల‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.



 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: