ఏపీ : విదేశాల నుండి వచ్చి.. అజ్ఞాతంలోకి..!

Chandrasekhar Reddy
కరోనా వచ్చి దాదాపుగా రెండేళ్లు అవుతున్నప్పటికీ దానిపై ప్రజలలో అది కూడా విద్యావంతులైన వారిలో కూడా పూర్తిగా అవగాహన వచ్చినట్టుగా కనిపించడం లేదు. గతంలో కూడా గ్రామాలలో కట్టుదిట్టంగా పాటించిన నిబంధనలు విద్యావంతులు, అవిద్యావంతుల మధ్య తేడాను బాగానే చూపించింది. చదువుకున్న వాడికంటే చాకలివాడు మేలు అన్న చందాన ప్రస్తుతం విద్యావంతులు వింతగా ప్రవర్తిస్తున్నారు. ఒకరికి తామే చెప్పాల్సిన పరిస్థితిలో ఉండి కూడా వాళ్ళు మరొకరితో చెప్పించుకునే పరిస్థితులను సృష్టించుకుంటున్నారు. ప్రారంభంలో అంటే అదేమిటో అనే ఆందోళన ఉంటుంది కాబట్టి ఎవరి మానాన వాళ్ళు భయబ్రాంతులకు గురికావడం సహజం, వచ్చి ఇంతకాలం అయ్యాక కూడా ఆయా నిబంధనలకు అనుగుణంగా సహకరించకపోవడం శోచనీయం.

ఒకపక్క మరోసారి కొత్త వేరియంట్ వలన దేశంలో అత్యవసర పరిస్థితి ఉన్నదని తెలిసి కూడా దానికి తగ్గట్టుగా పెట్టుకున్న నియమావళిని అతిక్రమించి విదేశాల నుండి వచ్చిన వారు తమ ఆచూకీని దాచుకుంటూ ఉన్నారు. ఇలాంటివి చేయడం ద్వారా మిగిలిన వారిలో అలాగే ప్రభుత్వానికి లేనిపోని సమస్యలు వస్తాయని వాళ్లకు తెలియదా అనేది ఇక్కడ ప్రశ్న. అన్ని తెలిసిన వాళ్ళు కూడా ఇలాంటి పనులకు పూనుకుంటు ఉంటె మిగిలిన వారికి చెప్పేదెవరు అనేది వాళ్ళు కాస్త ఆలోచించుకోవాల్సి ఉంది. ఇదేమి మాములు వైరస్ కాదు, ఒక్కరితో పోతుంది అనుకోవడానికి, ఒక్కరు పొరపాటు చేస్తే సమాజాన్ని తుడిచేసే పరిస్థితి వరకు వెళ్లే అవకాశం ఉంది.  

ప్రస్తుతం దేశంలో విదేశాల నుండి వచ్చిన వారికి కొన్ని నిబంధనలు పెట్టిన మాట వాస్తవం. అవన్నీ ఎవరికోసం పెట్టారు అనేది ఆలోచించి అందరు సహకరించాల్సి ఉంది. ఏపీలో కూడా విదేశాల నుండి ఈ నెలలోనే అనేక మంది వచ్చారు, వారందరు వచ్చినవాళ్లు వచ్చినట్టు తమ ఆచూకీని దాచిపెట్టుకుంటున్నారు. ఒక్క ఈ నెలలోనే ఏపీకి 12500 మంది వచ్చినట్టు తెలుస్తుంది. అందులో 1700 మంది విశాఖ నుండే ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే విదేశాల నుండి వచ్చిన వారిలో 9000మందిని ప్రభుత్వం గురించగలిగింది. మిగిలినవారు 3500 మంది తమ ఆచూకీ దొరకకుండా తిరుగుతున్నారు. మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఇప్పటికే విదేశాల నుండి వచ్చిన ఇద్దరికీ కరోనా ఉందని నిర్దారించారు, అది కొత్త వేరియంట్ అవునా కదా అనేది తెలియాల్సి ఉంది. ఇలా కనిపించకుండా పోతున్న వారిని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం విదేశాల నుండి వచ్చిన వారు స్వచ్చందంగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. గతంలో మాదిరిగా స్థానిక వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆయా సమాచారం సేకరించేందుకు, తగిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: