కోవిడ్ అలర్ట్ : గర్భిణులూ...బీ కేర్ ఫుల్

Vennelakanti Sreedhar

కోవిడ్-19 మహమ్మారి ప్రపంచం పై పడగవిప్పిన ప్పటి నుంచి మానవాళికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోందన్న మాట సుస్పష్టం. కంటికి కనిపించని ఈ మహమ్మారిని అందరూ శత్రువుతో పోల్చారు. ఎట్లైనా సరే ఈ  మహమ్మారికి అడ్డుకట్ట వేయాలని వైద్య రంగ పరిశోధకులు  అహర్నిశలూ కృషి చేస్తున్నారు. వారు తమ పరిశోధనల్లో గుర్తించిన అంశాలను ముందుగా డబ్ల్యూ. హెచ్.ఓ  ముందుచుతున్నారు. ఆ తరువాత  ప్రసార మాధ్యమాల తరువాత జనావళి ముందుంచుతున్నారు.
యూనివర్శిటీ డి పారిస్ కు చెందిన వైద్య రంగ పరిశోధకులు  గర్భిణులు- కోవిడ్ అన్న అంశం పై అధ్యయనం చేశారు. విస్తృత స్థాయిలో పరిశోధనలు  నిర్వహించారు. గర్భిణులకు కోవిడ్-19 సోకితే వారు భవిష్యత్ జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తేల్చారు. గర్భిణులు ఆరోగ్య పరంగా చాలా చాలా కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుందని తెలిపారు. కోవిడ్ సోకని వారితో పోలిస్తే కరోనా బారిన పడి కోలుకున్న వారు ప్రసవ సమయంలో చాలా ఇబ్బందులు పడతారని కనుగొన్నారు. ఫ్రాన్స్ దేశంలో ఈ సంవత్సరం ఆరంభం నుంచి జూన్ నెలాఖరు వరకూ ఆసుపత్రుల్లో చేరిన రెండున్నర లక్షల మందిని వీరు పరీక్షించారు. కోవిడ్-19 రాని వారితో పోలిస్తే..కరోనా బాధిత గర్భవతుల్లో అవయవ వ్యవస్థల్లో లోపం కనిపించింది. అంతే కాకుండా అధక రక్తస్రావం, రక్తపోటు అధికమవటం సంభవించినట్లు వైద్య శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. కోవిడ్-19 బారిన పడిన గర్భవతులలో చాలా మంది ఐసియు లో చికిత్స పొందాల్సిన పరిస్థితులను కూడా ఎదుర్కోన్నారు. ఒకింత సంతోషించాల్సిన విషయం ఏమిటంటే... కరోనా బాధిత మహిళలకు గర్భస్రావం కావడం, జీవం కోల్పోయిన శిశు జననాలు, ప్రసవ సమయంలో రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు ఎదురు కాలేదు. ఏది   ఏమైనాగర్భిణులు చాలా జాగ్రత్త పడాలని యూనివర్సిటి డి పారిస్ వైద్య పరిశోధకులు  హెచ్చరిస్తున్నారు. గర్భిణులు గైనకాలజిస్టుల సూచన మేరకు ఆహార నియమాలు పాటించాలని తెలిపారు. క్రమం తప్పకుండా వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: