షుగర్ వ్యాధి ఎన్నో ఏళ్ల నుంచి చాలా ఇబ్బంది పెడుతున్న ప్రాణాంతక వ్యాధి. ఇక ఈ మధ్య కాలంలో చాలా మంది కూడా షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. చనిపోతున్నారు కూడా. షుగర్ వ్యాధి ముదిరిపోవడానికి కారణాలలో ఆహారపుటలవాట్లు కూడా. మంచి ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకుంటే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. కాబట్టి షుగర్ వ్యాధితో బాధపడేవారు ఖచ్చితంగా ముల్లంగిని తినాలి.ఇక రోజుకు ఒక కప్పు ముల్లంగిని సలాడ్ (radish salad) రూపంలో కనుక తింటే మీకు విటమిన్ సీ పుష్కలంగా అందుతుంది.అందువల్ల షుగర్ అనేది మీకు కంట్రోల్ లో ఉంటుంది.ముల్లంగి వల్ల మన బాడీలో తెల్లరక్తకణాలు అనేవి వృద్ధి చెంది ఇమ్యూనిటీ పెరుగుతుంది.ఇక జలుబు ఇంకా దగ్గు వంటి సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.ముల్లంగి దుంపలతో పులుసు ఇంకా వేపుడు కూడా చేసుకోవచ్చు. ఇక ఈ ముల్లంగిలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి.
అవి కనుక తెలిస్తే, మీరు కూడా దెబ్బకి తినడం మొదలు పెడతారు.ముల్లంగికి ఉండే ఒక రకం ఘాటు గొంతు సమస్యల నుంచి మీకు తక్షణమే మంచి ఉపశమనం కలిగిస్తుంది.
మీ శరీరంలో కనుక కఫం అనేది పేరుకుపోతే వెంటనే తగ్గించేసే గుణం ఈ ముల్లంగికి ఉంటుంది.ఈ ముల్లంగి ముఖ్యంగా రక్తలంలోని చెడు వ్యర్థాలను తొలగించడంలో ఎంతగానో సహాయపడుతుంది.అందువల్ల మీ శరీరంలో ప్రవహించే రక్తానికి తగినంత ఆక్సిజన్ అనేది పుష్కలంగా అందుతుంది. ఇది కాలేయంపై ఎలాంటి భారం అనేది పడకుండా కాపాడుతుంది.ముల్లంగిని ఎక్కువగా తినేవారు కామెర్ల వంటి సమస్యలకు చాలా దూరంగా ఉంటారు.ముల్లంగి మీ శరీరంపై ఏర్పడే తెల్లటి మచ్చలను కూడా తొలగిస్తుంది.ఎందుకంటే ఈ ముల్లంగిలో పొటాషియం ఎక్కువ ఉంటుంది. మీరు తినే ఆహారంలో తగిన మోతాదులో పొటాషియం కనుక ఉంటే రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. అందుకే రక్తప్రసరణతో బాగా బాధపడేవారు ఈ ముల్లంగిని ఎక్కువగా తినాలి అంటారు.