ఇప్పటి ప్రజల జీవిత కాలం తగ్గిపోవడానికి కారణాలు ఇవేనా?
ఎపుడు నడుం వంచి పనులు చేసుకుంటూ ఉండేవారు అందుకే వారంతా సన్నగా నాజూగ్గా ఉండేవారు. అలాగే ఆరోగ్యంగా ఉండేవారు. అయితే తరాలు మారే కొద్ది, అభివృద్ధి పెరిగే కొద్ది మనుషుల్లోని వారి జీవనశైలిలోను ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. దాని వలన కొంత వరకు మన ఆరోగ్యం కూడా కుంటుపడిందనే చెప్పాలి. అధిక రాబడి కోసం రసాయనాలతో, కృత్రిమ ఎరువులతో పండించే ఆహార పదార్థాలు. నిలువ చేయడానికి రసాయనాలు, వాషింగ్ మెషిన్ లు, వంటి వాటి వలన మనకు శరీర పని సులభం అవుతుంది. కానీ..శరీరానికి కాస్తో కూస్తో అందే వ్యాయామం కూడా దూరం అవుతుంది. ఇప్పటి వ్యవసాయ పద్దతులు...అధిక రసాయనాల వినియోగం మనం ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది.
తద్వారా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు... కాబట్టి కాస్త అయినా మన జీవన విధానాన్ని ఆరోగ్యకరంగా మార్చుకోవాలి. ఉదయాన్నే లేవడం, పనులను చకచకా చేసుకోవడం, వీలైనంత వరకు వ్యాయామం చేయడం. వాకింగ్ చేయడం, మన ఇంటి పనులను సొంతంగా చేసుకోవడం, నూనె పదార్దాలను వీలైనంత వరకు దూరం పెట్టడం, జంక్ ఫుడ్ ను పూర్తిగా మానేయడం. వంటివి చేయడం ద్వారా మళ్ళీ ప్రజలు అప్పటి వారి లాగా ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించడానికి ఆస్కారం ఉంది.