చలి కాలంలో అస్సలు చేయకూడని పనులు ఇవే !

frame చలి కాలంలో అస్సలు చేయకూడని పనులు ఇవే !

Veldandi Saikiran
ప్రస్తుతం చలికాలం నడుస్తున్న సంగతి మనందరికీ విధితమే. చలికాలం రాగానే మనకు అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జ్వరము, జలుబు మరియు దగ్గు ఇతర అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ చలి కాలంలో మనం కొన్ని నియమ నిబంధనలు పాటిస్తే... ఇలాంటి అనారోగ్య సమస్యలు అయినా తప్పించుకోవచ్చు.

బట్టలు : వేడిగా ఉండటం కోసం చాలామంది 2, 3 డ్రెస్సులు వేసుకుంటారు. అయితే దీని కారణంగా మన శరీరంలో ఓవర్హీట్ అనే సమస్య తలెత్తుతుంది. అలాగే ఓవర్హీట్ కారణంగా మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దీనివల్ల మనకు అనారోగ్య సమస్యలు త్వరగా తలెత్తే ప్రమాదం ఉంటుంది.

అధికం గా తినడం : మనం కొద్ది ఉన్న లేవగానే ఎక్కువ తినడం పై దృష్టి సారిస్తాఎం. అయితే చలికాలంలో ఎక్కువగా తింటే అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మనం తక్కువగా తింటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది.

కెఫిన్ : ప్రస్తుత చలి కాలంలో మనం చలి నుంచి దూరం కావడానికి కాఫీ లు మరియు టీలు ఎక్కువగా తాగు తాం. ఇలా తాగడం కారణంగా మన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. రోజుకు ఒకసారి లేదా రెండు సార్లు తాగితే ఇలాంటి సమస్యలు తలెత్తవని వైద్యులు చెబుతున్నారు.

నీళ్లు తాగటం : చాలామంది చలికాలం రాగానే నీళ్లు తాగడం మానేస్తారు. యూరిన్ సమస్య మరియు యు.కె మటన్ వల్ల బాడీ లో ఉన్న నీరు బయటికి వచ్చేస్తుంది. అలాంటి నేపథ్యంలో మన శరీరంలో నీళ్లు లేక డీహైడ్రేషన్ సమస్య మనం లోనవుతాం. అలాగే కిడ్నీ సమస్యలు మరియు అజీర్తి సమస్యలు కూడా మనకు తలెత్తే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. ఇలాంటి తరుణంలో చలికాలంలో కచ్చితంగా వైద్య నిపుణులు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: