కార్డియాక్ అరెస్ట్ అంటే ఏమిటి? పూర్తి వివరాలివే?
ఇంతకీ ఇది ఏమిటి..?? ఎందుకు వస్తుంది...? ముందుగా లక్షణాలు ఏమైనా కనిపిస్తాయా..?? వంటి వాటి గురించి ఇపుడు తెలుసుకుందాం.
ఈ వివరాలన్నీ ప్రముఖ వైద్యులు చెప్పబడిన సమాచారం నుండి సేకరించబడినవి.
గుండెలో ఏర్పడే ఎలక్ట్రికల్ అలజడి వలన కార్డియాక్ అరెస్ట్ అనేది ఏర్పడుతుంది. గుండె పని తీరులో వచ్చే ఒక ఆకస్మిక లోపం అని చెప్పాలి. ఇక్కడ గుండె పోటు అనేది వేరు మరియు కార్డియాక్ అరెస్ట్ అనేది వేరు. గుండె కండరాలకు రక్త ప్రసరణలో వచ్చే హెచ్చు తగ్గులు గుండె పోటుకు కారణమవుతాయి. గుండె పోటు కార్డియాక్ అరెస్ట్ కు ప్రేరణ కలిగించగలదు. ఇటువంటి సమయంలో నిముషాల్లోనే బాధితుడికి చికిత్స అందాలి లేదంటే ప్రాణం పోయే ప్రమాదం ఉంది.
కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు కింది విధంగా ఉంటాయి.
ముందుగా పెద్దగా లక్షణాలు కనిపించవు. అయితే కార్డియాక్ అరెస్ట్ ను గుర్తించ వచ్చు. అది ఎలా అంటే...?
* మనిషి హఠాత్తుగా పడిపోవడం.
* పడిన వెంటనే స్పృహ కోల్పోవడం.
* శ్వాస తీసుకోలేకపోవడం.
* నాడి లేకపోవడం.
* శరీరం వెంటనే చల్లబడిపోవడం.
ఇలాంటి లక్షణాలు గుర్తించినప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే హాస్పిటల్ కు తీసుకువెళ్ళాలి. ఇటువంటి సమయంలో ప్రతి క్షణము బాధితుడి జీవన మరణాన్ని శాసిస్తుంది అన్న విషయం గుర్తుంచుకోవాలి.
కార్డియాక్ అరెస్ట్
ఎందుకు ఏర్పడుతుంది..?
* మందులు వాడకం, గతంలో ఉన్నటువంటి గుండె సమస్యలు వంటి వాటి వలన ఏర్పడే అవకాశాలు ఎక్కువ.
కార్డియాక్ అరెస్ట్ ను ముందుగా ఎలా నివారించవచ్చు..??
* ఇ సి జి అనే ఒక పరీక్ష ద్వారా.. హృదయ స్పందన తీరు, వాటి వివరాలు దాదాపు పూర్తిగా తెలుసుకోవచ్చు. ఈ పరీక్ష రిపోర్ట్ ఆధారంగా డాక్టర్లు కార్డియాక్ అరెస్ట్ మరియు గుండె సంబంధిత అనారోగ్య సమస్యలను నిర్థారించగలరు.
*న్యూక్లియర్ స్కాన్, ఎఖోకార్డియోగ్రామ్ ధ్వని తరంగాలను వినియోగించడం, ఛాతీ ఎక్స్-రే వంటి తదితర పరీక్షల ఆధారంగా కూడా ఒక నిర్ధారణకు రావచ్చు.
కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి.. గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వారు తస్మాత్ జాగ్రత్త. ప్రాణం చాలా విలువైంది.