
రాత్రి ఫోన్లు వాడేవారికి షాక్.. ఆ సమస్యలు తప్పవు ?
నిద్రలేమి సమస్యలు : మనం నిద్రపోవడానికి అరగంట ముందు స్మార్ట్ ఫోన్ ను వాడటం ఆపేయాలి. ఒకవేళ స్మార్ట్ఫోన్ను అదే విధంగా వాడితే... వాడి కాంతి కారణంగా నిద్రలేమి సమస్యలు మనకు తలెత్తుతాయి. అలాగే అరగంట ముందే ఫోన్ ఆఫ్ చేయాలి.
క్యాన్సర్ రిస్కు ఎక్కువ ఉంటుంది : స్మార్ట్ఫోన్లు ఎక్కువగా వాడటం కారణంగా క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే మొబైల్ ఫోన్ ద్వారా ఎలక్ట్రానిక్ మాగ్నెటిక్ రేస్ విపరీతంగా రావడం కారణంగా... క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు చెవి మరియు బ్రెయిన్ ట్యూమర్లు వచ్చే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు.
సంతాన సమస్యలు : చాలా మంది మొబైల్ ఫోన్ ను పాయింట్ పాకెట్ లో పెట్టుకుంటారు. దాని వల్ల రేడియేషన్ అనేది మన శరీరంలోకి చేరుతుంది. తద్వారా పురుషుల్లో ఉండే స్పెర్ము కౌంట్ విపరీతంగా పడి పోతున్నాయి. తద్వారా... సంతాన సమస్యలు వచ్చే ప్రమాదం పొంచి ఉంటుంది. కాబట్టి స్మార్ట్ఫోన్లు వాడే వారు జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. లేనియెడల అనేక ప్రమాదాలు సంభవించే ప్రమా దం ఉంటుం ది.